ఛార్మి ప్రధాన పాత్రలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా పూరిజగన్నాథ్ మాట్లాడుతూ "జ్యోతిలక్ష్మి నాకు బాగా ఇష్టమైన కథ. ఆరు సంవత్సరాలుగా చార్మి ప్రాధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవల 'మిసెస్ పరాంకుశం' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాను. వెంకట కృష్ణమూర్తి గారు 19 ఏళ్ళ వయసులో రాసిన ఆ నవలకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసాం. మూవీ షూటింగ్ హైదరాబాద్, గోవా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. సినిమాలో చార్మి అధ్బుతంగా నటించింది. కళ్యాన్ గారితో మొదటిసారిగా ఈ సినిమాకి వర్క్ చేసాను. ఆయనతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సునీల్ కశ్యప్ గారి సంగీతం, భాస్కర్ భట్ల గారు రాసిన పాటలు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. చిత్రబృందమంతా చాలా కష్టపడి పని చేసారు. ఈ టీమ్ తో మరో సినిమా చేయాలనుంది" అని అన్నారు.
చార్మి మాట్లాడుతూ "కళ్ళుమూసి తెరిచే లోపు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. ఇంత మంచి టీమ్ తో నేనెప్పుడు వర్క్ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ లో నేను నటించలేదు. నా నిజజీవితంలో ఎలా ఉంటానో అలానే బిహేవ్ చేసాను. పూరి గారు, కళ్యాన్ గారు సినిమా చేయడంలో ఎంతో స్వేచ్చనిచ్చారు. విందా తెరపై నన్ను చాలా అందంగా చూపించారు. సునీల్ కశ్యప్ గారు ఈ సినిమాతో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు" అని చెప్పారు.
హీరో సత్య మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు.
సి.కళ్యాన్ మాట్లాడుతూ "పూరి గారితో ఏడు సంవత్సారాల క్రితమే సినిమా చేయాలనుకున్నాను కాని ఇప్పటికి కుదిరింది. 'జ్యోతిలక్ష్మి' ఓ యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ తో కూడిన డ్రామా. ఈ నెల 17 న చార్మి పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేసి నెలాఖరున ఆడియో విడుదల చేయనున్నాం. జూన్ మొదటి లేదా రెండవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని తెలిపారు.
భాస్కర్ భట్ల మాట్లాడుతూ "మహిళల ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన సినిమా ఇది. పూరి చేసిన సినిమాలో ఈ మూవీ కొత్తగా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో చార్మి అధ్బుతంగా నటించారు. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ అందించారు" అని అన్నారు.
సునీల్ కశ్యప్ మాట్లాడుతూ "సినిమాలో ప్రతి పాట, లిరిక్స్ చాలా పద్దతిగా ఉంటాయి. ఈ నెల 10వ తారీఖు నుండి రీరికార్డింగ్ మొదలుపెట్టనున్నాం" అని చెప్పారు.
పి.జి.విందా మాట్లాడుతూ "ఈ సినిమాలో పూరి గారు నాతో న్యూ డైమెన్షన్స్ చేయించారు. సినిమాతో చాలా తృప్తి చెందాను. సునీల్ గారి మ్యూజిక్ తో మంచి ఎనర్జీ వస్తుంది" అని చెప్పారు.
బి.ఏ.రాజు మాట్లాడుతూ "పూరిజగన్నాథ్ గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే 'జ్యోతిలక్ష్మి' ఒక ఎత్తు. చార్మి గారి పెర్ఫార్మన్స్ అధ్బుతం" అని చెప్పారు.
ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.