‘కాంచన’ తర్వాత ‘గంగ’తో మరోసారి హీరోగా, డైరెక్టర్‌గా తన పవర్‌ని చూపించిన లారెన్స్‌కి ఇప్పుడు కోలీవుడ్‌లో డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే తమిళ్‌లో 50 కోట్లు కలెక్ట్ చేసి ‘కాంచన2’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘గంగ’గా తెలుగులో విడుదలైన ఈ చిత్రం మొదటివారం 12 కోట్లు కలెక్ట్ చేసి రోజు రోజుకీ పెరుగుతున్న కలెక్షన్స్‌తో హిట్ రేంజ్ ఇంకా పెరుగుతోంది. ఇదిలా వుంటే డైరెక్టర్‌గా తమిళ్‌లో ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. లారెన్స్ హీరోగా, అతని డైరెక్షన్‌లోనే సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే లారెన్స్ మాత్రం సూపర్‌గుడ్ ఫిలింస్ బేనర్‌లో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘పటాస్’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చెయ్యబోతున్నాడు లారెన్స్. తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చెయ్యబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో నిర్మించడానికి నిర్మాత ఆర్.బి.చౌదరి సన్నాహాలు చేస్తున్నారు.