Advertisementt

'ఆంధ్రాపోరి' మూవీ ఆడియో లాంచ్..!

Thu 07th May 2015 02:52 PM
andhrapori movie,akash puri,ulka guuptha,raj madiraj,ram prasad  'ఆంధ్రాపోరి' మూవీ ఆడియో లాంచ్..!
'ఆంధ్రాపోరి' మూవీ ఆడియో లాంచ్..!
Advertisement
Banner Ads

ఆకాష్‌ పూరి, ఉల్క గుప్తా జంటగా ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజ్‌ మాదిరాజు దర్శకత్వంలో ఎ.రమేష్‌ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆంధ్రాపోరి’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని రాక్ హైట్స్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సీడీని ప్రకాష్ రాజ్ కు అందించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ "ఆకాష్, ప్రసాద్ ప్రొడక్షన్ తో ఇంట్రడ్యూస్ అవ్వడం గొప్పగా ఉంది. టీమ్ అందరికి నా అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ "ఇంత పెద్ద బ్యానర్ లో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. రాజ్ గారు చాలా హెల్ప్ చేసారు. జోశ్య గారు నేను ఎక్స్ పెక్ట్ చేయలేని మ్యూజిక్ ఇచ్చారు. కెమెరామెన్ కి స్పెషల్ థాంక్స్ నన్ను అందంగా చూపించారు. ఈ సినిమా తరువాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పారు.

ఉల్కా గుప్తా మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

రాజ్ మాదిరాజ్ మాట్లాడుతూ " ఈ బేనర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. ఇది మంచి కమర్షియల్‌ మూవీ అవుతుందని నా నమ్మకం. ఇదొక మంచి లవ్ స్టొరీ. ఎవరిని కించపరచడానికి ఈ టైటిల్ పెట్టలేదు. హీరో హీరోయిన్ ను ప్రేమగా పిలుచుకునే పేరది" అని చెప్పారు

జోశ్యభట్ల మాట్లాడుతూ "ఇంత మంచి చిత్రానికి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చిన రాజ్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ప్రతి స్వరంలోను డైరెక్టర్ చాలా కేర్ తీసుకున్నారు" అని చెప్పారు. 

మొదటి పాటను రామజోగయ్య శాస్త్రి, హ్యాపీడేస్ ఫేమ్ వంశీ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను ఒక పాటనే రాయాల్సి వచ్చిన రాజ్ మాదిరాజు గారు నాకు మొత్తం స్క్రిప్ట్ నీ వినిపించారు. జోశ్యభట్ల గారి మ్యూజిక్ చాలా ట్రెండీ గా ఉంటుంది. ఈ సినిమాకి కూడా అలాంటి సంగీతాన్నే అందించారు" అని చెప్పారు.

హ్యాపీడేస్ ఫేమ్ వంశీ మాట్లాడుతూ "జోశ్యభట్ల గారు నాకు అత్యంత సన్నిహితులు. ఈ సినిమాతో ఆయన మరిన్ని పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

రెండవ పాటను లిరిసిస్ట్ కృష్ణ మదినేని, నిర్మాత రమేష్ ప్రసాద్ కలిసి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ "మా తండ్రి గారు మొదలు పెట్టిన సినీ ప్రయాణాన్ని టెక్నికల్ సైడ్ ఉంటూ నేను కంటిన్యూ చేస్తున్నాను. 'ఆంధ్రపోరి' మా ప్రొడక్షన్ లో వస్తున్న ముప్పై వ చిత్రం. డైరెక్టర్ రాజ్ మాదిరాజుకు ఇది మా బ్యానర్ లో రెండవ సినిమా. రాజ్‌లో మంచి టాలెంట్‌ వుంది. అందుకే మళ్ళీ ఆయనతోనే సినిమా చేశాం. ఈ సినిమా ఉల్క, ఆకాష్ అధ్బుతంగా నటించారు. తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది" అని అన్నారు.

మూడవ పాటను లిరిసిస్ట్ చక్రవర్తులు, డైరెక్టర్ రాహుల్,హీరో సుధాకర్, నటుడు రాజేంద్రప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రవర్తులు మాట్లాడుతూ "నాతో ఓ పాటను రాయించారు. ఈ పాట బాగా రావడానికి కారణం సంగీతం అందించిన జోశ్యభట్ల గారు, పాట పాడిన హేమచంద్ర" అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "టైటిల్ వింటుంటే సినిమా సరదాగా ఉంటుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. నిర్మాత ప్రసాద్ నాకు మంచి స్నేహితుడు. సినిమాకి పని చేసిన అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 

సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మరాఠిలో సూపర్‌హిట్‌ అయిన ‘టైమ్‌పాస్‌’ అనే చిత్రం ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారు. మరాఠిలో ఆ చిత్రం చరిత్రను తిరగరాసింది. అలాంటి జోనర్ లో పూరి తనయుడు ఆకష్ కనిపించనుండడం సంతోషంగా ఉంది. 'ధోని' సినిమా టైం లోనే ఆకాష్ కు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో తెలిసింది. సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ గా ఉంటాడు" అని చెప్పారు.

సినిమాలో నాలుగవ పాటను లిరిసిస్ట్ నంద కిషోర్, నటుడు చైతన్య కృష్ణ, హీరో నందు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందకిషోర్ మాట్లాడుతూ "రాజ్ గారు నన్ను పిలిచి ఓ తెలంగాణా పాటను రాయమని అడిగారు. చాలా సంతోషపడ్డాను. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ మాదిరాజ్ గారికి, జోశ్యభట్ల గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

నందు మాట్లాడుతూ "జోశ్యభట్ల గారు నాకు మంచి స్నేహితులు. ఈ సినిమాతో ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. పూరి గారు వారి తనయుడ్ని అప్ కమింగ్ డైరెక్టర్ చేతిలో పెట్టడం గొప్ప విషయం. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

అయిదవ పాటను లిరిసిస్ట్ కిట్టు విస్సా ప్రగడ, రైటర్ బి.వి.ఎస్.రవి, ఎమ్.ఎల్.సి.రామచంద్ర గారు కలిసి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ "సినిమాలో పాటలు బావున్నాయి. తెలుగు వారందరినీ ఈ సినిమా అలరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ "సినిమాలో పాటలు బావున్నాయి. లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

ఆరవ పాటను లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, నటి శ్రీముఖి, హీరో అబిజీత్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ "లిరిసిస్ట్ లు అందరు మంచి సాహిత్యాన్ని అందించారు. జోశ్యభట్ల మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో హైదరాబాదీ బాషలో ఓ పాటను రాసాను. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఆకాష్‌పూరి, ఉల్క గుప్తా, అరవింద్‌ కృష్ణ, ఈశ్వరిరావు, పూర్ణిమ, ఉత్తేజ్‌, డా॥ శ్రీకాంత్‌, అభినయ, శ్రీముఖి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి, సంగీతం: డా॥ జోశ్యభట్ల, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డాన్స్‌: చంద్రకిరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మహేష్‌ చదలవాడ, కోడైరెక్టర్‌: రమేష్‌ నారాయణ్‌, నిర్మాత: ఎ.రమేష్‌ప్రసాద్‌, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు. 

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads