Advertisementt

'దొంగాట' ప్లాటినం డిస్క్ వేడుక..!

Thu 07th May 2015 08:02 AM
dongata movie,manchu lakshmi,vamsi krishna,adavi sesh  'దొంగాట' ప్లాటినం డిస్క్ వేడుక..!
'దొంగాట' ప్లాటినం డిస్క్ వేడుక..!
Advertisement
Ads by CJ

మంచు లక్ష్మీ, అడవి శేష్‌ ప్రధాన పాత్రల్లో విద్య నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎన్‌.వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగాట’. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ "ఈ చిత్రం మే8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ కాపి చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. సినిమాను చాలా కూల్‌గా చేశాం. దానికి ముఖ్యకారణం వంశీకృష్ణ. కెమెరామెన్ భాస్కర్ తో చాలా సినిమాలు చేయాలనుంది. అంత అధ్బుతంగా కెమెరా వర్క్ అందించాడు. సినిమాలో శేష్ చాలా అందంగా ఉన్నాడు" అని చెప్పారు.

వంశికృష్ణ మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది. సినిమాకి అన్ని కుదిరాయి. చిత్ర బృందమంతా చాలా ఎఫోర్ట్ పెట్టి చేసారు. వారందరికీ నా ధన్యవాదాలు. రఘుకుంచె, సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ అందించారు. భాస్కర్ తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేసాను. దొంగాట అందరినీ ఆదరిస్తుందనే నమ్మకతో ఉన్నాం" అని చెప్పారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ "ఫుల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా ఇది. అందరు సరదాగా ఎంజాయ్ చేసే మూవీ" అని చెప్పారు.

రఘుకుంచె మాట్లాడుతూ "సినిమా ఫస్ట్ కాపీ చూసిన వారందరూ చాలా బావుందని చెప్పారు. బాలీవుడ్ లో ఒక సినిమాకి నాలుగు నుండి ఐదుగురు మ్యూజిక్ అందిస్తుంటారు. అప్పుడే మంచి ఔట్ పుట్ వస్తుంది. తెలుగులో కూడా అదే ట్రెండ్ రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

భాస్కర్ మాట్లాడుతూ "ఇదొక మంచి కామెడీ ఫిల్మ్. అందరు ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు. 

అడవి శేష్‌ మాట్లాడుతూ "ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన వంశీకి థాంక్స్‌. నేను కూడా ఈ సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ కామెడీ ట్రై చేశాను. ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనేది చాలా గ్రేసియస్‌ ప్రొడక్షన్‌. ఒక అద్భుతమైన సినిమాని తీస్తున్నారు. నేను సినిమా చేస్తూ ఎంత ఎంజాయ్‌ చేశానో మీరు చూస్తూ అంత ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

బ్రహ్మానందం, జె.పి., గిరిబాబు, అన్నపూర్ణ, పృథ్వి, ప్రగతి, మధు నందన్‌, ప్రభాస్‌ శ్రీను, నర్సింగ్‌ యాదవ్‌, అనంత్‌, శ్రీనివాసరాజు, సందీప్తి, మాస్టర్‌ ప్రేమ్‌, బేబీ కావేరి, లత ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్య మహావీర్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, వరికుప్పల యాదగిరి, సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, స్క్రీన్‌ప్లే: ఎన్‌.వంశీకృష్ణ, మోహన్‌ భరద్వాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, కో`ప్రొడ్యూసర్‌: గాంధీ, నిర్మాత: మంచు లక్ష్మీ, కథ, దర్శకత్వం: ఎన్‌.వంశీకృష్ణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ