ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో విజయ్ భరత్, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, బాయిలింగ్ స్టార్ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్‌మూర్తి మాట్లాడుతూ..‘100% వినోదం పంచే అద్భుతమైన చిత్రమిది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్ స్టార్ పృథ్వీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ నటన, కామెడీ ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ అనంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తిచేసి... మే నెలాఖరుకి ఆడియోని, జూన్‌లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము...’ అన్నారు.
బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్ స్టార్ పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ భరత్, అశ్విని, కాంచన, సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య తారాగణం.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: సుభాష్ ఆనంద్, కథ: జయకుమార్, మాటలు: అంజన్, పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్,కృష్ణచిన్ని, కెమెరా: మల్లిఖార్జున్, ఎడిటింగ్: రాంబాబు,
నిర్మాణం: ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి