Advertisementt

'హితుడు' మూవీ మోషన్ పోస్టర్ లాంచ్..!

Tue 05th May 2015 06:55 AM
hithudu movie,motion poster launch,jagapathibabu,viplav  'హితుడు' మూవీ మోషన్ పోస్టర్ లాంచ్..!
'హితుడు' మూవీ మోషన్ పోస్టర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

జగపతిబాబు, మీరా నందన్‌ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఫిలింస్‌ పతాకంపై విప్లవ్‌ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కేఎస్వీ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘హితుడు’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కేఎస్వీ మాట్లాడుతూ "ఈ చిత్రంలో ప్రముఖ హీరో జగపతిబాబుగారు ప్రధాన పాత్ర పోషించారు. యువ దర్శకుడు విప్లవ్‌ తొలి ప్రయత్నంగా చేసిన ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది ఒక సామాజిక అవసరాన్ని గుర్తు చేస్తూ తీసిన చిత్రం. ఇది కార్యాచరణకు సంబంధించిన చిత్రం. సమాజంలో జరగాల్సిన ముఖ్యమైన కార్యం ఏదైతే వుందో దాన్ని ప్రేరేపిస్తూ తీసిన సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను" అని అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ "ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. బడ్జెట్ పరంగా ఖర్చు ఎక్కువవుతున్నా నిర్మాత వెనుకాడలేదు. ఇదొక ప్రేమ కథ. మాస్టర్, నక్సలైట్ పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాను. చాలెంజింగ్ రోల్ లో నటించాను. హీరోయిన్ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుంది.  రెగ్యులర్ మ్యూజిక్ లా కాకుండా భిన్నంగా ఉంటుంది. సినిమాలో పాటలు అధ్బుతంగా ఉంటాయి. ప్రేక్షకులు సినిమా చుసిన తరువాత మంచి సినిమా చూసాం అనే ఫీల్ లో ఉంటారు" అని చెప్పారు.

విప్లవ్ మాట్లాడుతూ "సీతారాం అనే వ్యక్తి తనకు తెలిసిన సిద్ధాంతాలను మరొకరి చెప్పే ప్రాసెస్ లో ఓ స్కూల్ ను పెడతారు. అక్కడకి వచ్చిన ఓ అమ్మాయికి, సీతారాం కు మధ్య సాగే ప్రేమాయణమే ఈ కథ. కోటి గారు మంచి మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అనంతశ్రీరాం గారు ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించారు" అని అన్నారు. 

బెనర్జీ మాట్లాడుతూ "కొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సినిమాలో జగపతి బాబు అధ్బుతంగా నటించాడు. సినిమాలో ఫ్రెష్ నెస్ ఉంటుంది. విప్లవ్ కు కథ మీద క్లారిటీ ఉంది. ప్రతి సీన్ చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు" అని అన్నారు.

సి.వి.నరసింహారావు మాట్లాడుతూ "ఇదొక మంచి సినిమా అవుతుంది. కెమెరామెన్ విజువల్ గా అధ్బుతంగా ప్రెజంట్ చేసాడు" అని అన్నారు.

జగపతిబాబు, మీరా నందన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: కోటి, పాటలు: అనంతశ్రీరామ్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల, సమర్పణ: సుంకర మధుమురళి, నిర్మాత: కేఎస్వీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ