Advertisementt

దేవసేన అనుష్క లుక్ కి టైం చెప్పేసాడు!

Tue 05th May 2015 06:54 AM
devasena,anushka,may 6th,anushka devasena look  దేవసేన అనుష్క లుక్ కి టైం చెప్పేసాడు!
దేవసేన అనుష్క లుక్ కి టైం చెప్పేసాడు!
Advertisement
Ads by CJ

బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్, శివుడుగా ప్రభాస్ ఎలా ఉంటారో ప్రేక్షకులకు పరిచయం చేశారు రాజమౌళి. ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. బాహుబలిలో దేవసేనగా అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం అనుష్క పోస్టర్ విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు. 'బాహుబలి' రెండవ భాగంలో అనుష్క హీరోయిన్ అనే సంగతి మీకు తెలుసు. కానీ, మొదటి భాగం 'బాహుబలి - ద బిగినింగ్'లో కొద్ది సమయం వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. మేకింగ్ వీడియోలో రాజసం ఉట్టిపడే పాత్రలో అనుష్క ఆహార్యం అందరిని ఆకట్టుకుంది. మొదటి పార్టులో ఆమె ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం అందరిలో ఉంది.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లకు ప్రసంశలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాకున్న క్రేజ్ తో పోలిస్తే విమర్శలు చాలా చిన్నవి. మే 31న ట్రైలర్ విడుదల చేస్తున్నారు. జూలై 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ