Advertisementt

అభిమాని కుటుంబానికి అండగా ఎన్టీఆర్..!

Mon 04th May 2015 02:27 PM
ntr helps his fan,hero ntr,jr ntr news,ntr helping nature,  అభిమాని కుటుంబానికి అండగా ఎన్టీఆర్..!
అభిమాని కుటుంబానికి అండగా ఎన్టీఆర్..!
Advertisement
Ads by CJ
రాజశేఖర్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించాడు. త్వరలో జరగబోయే అతని వివాహానికి బంధువులను ఆహ్వానించడానికి వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మీడియా ద్వారా ఈ వార్తను ఎన్టీఆర్ తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ అప్ సెట్ అయ్యారని సన్నిహితుల సమాచారం.   

రాజశేఖర్ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు సహాయం చేయవలసిందిగా ఎన్టీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్, తన మనుషులను సహాయం చేయడానికి పంపించారు. మరణించిన తర్వాత ఐదవ రోజున జరిగే కార్యక్రమాల ఖర్చును ఎన్టీఆర్ భరించనున్నారు. అక్కడ స్థానిక అభిమాని అయిన చెన్నయ్య సహాయంతో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. 10 రోజుల తర్వాత రాజశేఖర్ కుటుంబాన్ని ఎన్టీఆర్ పరామర్శించడానికి వెళ్లనున్నారు. ప్రతి ఆడియో వేడుక జరిగిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.. మీ కోసం తల్లిదండ్రులు, పిల్లలు ఎదురుచూస్తున్నారు అని చెప్తుంటారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ