Advertisementt

వర్మ అక్కడ ఆ పేరు.. ఇక్కడ ఈ పేరు..!

Tue 05th May 2015 01:08 AM
ram gopal varma news,ramgopal mogalipuvvu news,ram gopalm varm altese movie  వర్మ అక్కడ ఆ పేరు.. ఇక్కడ ఈ పేరు..!
వర్మ అక్కడ ఆ పేరు.. ఇక్కడ ఈ పేరు..!
Advertisement
 సచిన్‌ కథానాయకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ హిందీలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య బంధం గురించి తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ‘ఎఫైర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. పెళ్లయిన ప్రతీ మగాడికీ ఓ ఎఫైర్‌ ఉంటుందనే అంశంతో ఆ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే అదే సినిమాని తెలుగులో ‘మొగలిపువ్వు’ పేరుతో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం నుంచి ఆ సినిమా వివరాల్ని నిన్ననే ప్రకటించారు. అయితే నటీనటులు ఎవరన్నది మాత్రం అందులో చెప్పలేదు. ఇంటర్నెట్‌లో మాత్రం ఆ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్లు కనిపిస్తున్నాయి. అందులో ఉన్నది సచిన్‌ అని స్పష్టమవుతోంది. దీన్నిబట్టి హిందీలో తెరకెక్కుతున్న ఎఫైర్‌నే ఇక్కడ  ‘మొగలిపువ్వు’గా విడుదల విడుదల చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు. ఈ పేరును కూడా చిరంజీవి సూపర్‌హిట్‌ గీతం ‘రగులుగుతంది మొదలిపొద...’ని కాపీ కొట్టానని వర్మ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా కోసం వర్మ సుధీర్ఘకాలం తర్వాత విదేశాలకు వెళ్లి చిత్రీకరణ జరిపారు. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement