Advertisementt

'అనగనగా ఒక చిత్రం' మూవీ టీజర్ లాంచ్!

Mon 04th May 2015 09:18 AM
anaganaga oka chitram,anaganaga oka chitram teaser launch,dasari birthday celebrations,siva  'అనగనగా ఒక చిత్రం' మూవీ టీజర్ లాంచ్!
'అనగనగా ఒక చిత్రం' మూవీ టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్‌, గోవర్షిణి ఫిలింస్‌ పతాకాలపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘అనగనగా ఒక చిత్రమ్‌’. ఈ చిత్రం టీజర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లో దర్శకనిర్మాత దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "మల్లికార్జునరావు గారితో నేను రెండు సినిమాలు చేసాను. వారి తనయుడిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో తీసారు. ప్రేమ కథా చిత్రం సినిమాకి పని చేసిన ప్రభాకర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం సంతోషకరమైన విషయం. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

జె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ "దాసరి గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవ్వడం సంతోషంగా ఉంది. చిన్న సినిమాగా స్టార్ట్‌ అయి అందరు పెద్ద ఆర్టిస్టులతో ఒక పెద్ద సినిమాగా మారింది. సినిమా మంచి క్వాలిటీతో రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంతో సహకరిస్తున్నారు. మే 15 నుంచి ఫారిన్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేసి మే 31న ఆడియో రిలీజ్‌ చెయ్యాలన్నది మా ప్లాన్‌" అని చెప్పారు.

మల్లికార్జున రావు మాట్లాడుతూ "దాసరి గారి పుట్టినరోజున ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మేఘశ్రీ, శివ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్‌, సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్‌, ఎడిటింగ్‌: సాయి, ఆర్ట్‌: విజయకృష్ణ, స్టిల్స్‌: బాబు, కాస్ట్యూమ్స్‌: కె.మురళి, మేకప్‌: రంగా, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కొడాలిశ్రీనివాసరావు, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌: నాగిరెడ్డి, ఆర్‌.రాంబాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: సుదర్శన్‌, హరీష్‌ సజ్జా, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: ఉమేష్‌ నాగ, జి.యం.మంజునాథ్‌, కో`డైరెక్టర్‌: యస్‌.నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు, డైరెక్టర్‌ ఆఫ్‌ సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.ప్రభాకరరెడ్డి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ