కార్తికేయ సిద్ధార్థ, రీనా భాటియా జంటగా బలరాం ఆర్ట్ బ్యానర్ పై పరకోటి బాలాజీ దర్శకత్వంలో బొమ్మిశెట్టి బలరాం నిర్మిస్తున సినిమా 'శీనుగాడు కేక'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి టిడిపి నాయకుడు రామచంద్ర క్లాప్ కొత్తగా, టిఆర్ఎస్ అధ్యక్షులు రాములు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ప్రముఖ దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు పరకోటి బాలాజీ మాట్లాడుతూ "నేను దర్శకత్వం వహించిన పల్లవితో చరణ్ సినిమాలో సిద్ధార్థ నటన నన్ను ఆకట్టుకుంది. నటనలో ఆయనకు శిక్షణ ఇప్పించి ఈ సినిమాలో కూడా హీరోగా తననే ఎన్నుకున్నాను. ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నాను. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఫ్యాక్షన్, లవ్ ఎలిమెంట్స్ తో సినిమా రన్ అవుతుంటుంది. నిర్మాత బలరాం గారు ఎక్కడా కాంప్రమైస్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించమని చెప్పారు" అని చెప్పారు.
నిర్మాత బొమ్మిశెట్టి బలరాం మాట్లాడుతూ "ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా బ్యానర్ లో వస్తున్న మూడో చిత్రమిది. ఇదొక మాస్, యాక్షన్ ఎంటర్ టైనింగ్ సినిమా. ఈరోజు నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో, మూడో షెడ్యూల్ వైజాగ్, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.
కార్తికేయ సిద్ధార్థ మాట్లాడుతూ "డైరెక్టర్ గారి దర్శకత్వం వహించిన ఓ చిత్రంలో నటించాను. ఆయన మరలా నాకొక అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమాపై అందరు చాలా నమ్మకంతో ఉన్నారు" అని తెలిపారు.
రీనా భాటియా మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: అనుదీప్, ఎడిటింగ్: శ్రీనివాస్, ఫైట్స్: అవినాష్, డాన్స్: వెంకట్, ప్రసాద్, కో ప్రొడ్యూసర్: వరలక్ష్మి, నిర్మాత బొమ్మిశెట్టి బలరాం కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: పరకోటి బాలాజీ.