Advertisementt

కాక పుట్టిస్తున్న రామ్ డైలాగ్‌..!

Sun 03rd May 2015 01:06 PM
hero ram,pandaga chesko news,ram dialogues in pandaga chesko,rakul preeth singh,  కాక పుట్టిస్తున్న రామ్ డైలాగ్‌..!
కాక పుట్టిస్తున్న రామ్ డైలాగ్‌..!
Advertisement
Ads by CJ
ఇటీవ‌ల సినిమాల‌పైన సినిమాలే, హీరోల‌పైన హీరోలే పంచ్‌లు వేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.  మొన్నటికి మొన్న 'ఆగడు' సినిమాలో మ‌హేష్ చేత ఇలాంటి డైలాగుల్ని బోలెడ‌న్ని చెప్పించాడు శ్రీనువైట్ల‌. ఆ విష‌యం కొన్ని రోజులు ప‌రిశ్ర‌మ‌లో కాక పుట్టించింది.  చివ‌రికి మహేషే క‌ల‌గ‌జేసుకొని `ఆ డైలాగులు మా సినిమాల‌పైన వేసుకొన్న‌వే` అని  స‌ర్దిచెప్పాడు.  మంచు మనోజ్  కూడా ఆమ‌ధ్య 'కరెంట్ తీగ'లో 'చెట్టు పేరు చెప్పి కాయ పేరు చెప్పి` అంటూ  ఓ డైలాగ్ వదిలాడు.  ఇప్పుడు రామ్ వంతొచ్చింది. త‌న కొత్త సినిమా `పండగ చేస్కో` కోసం...   ``ధైర్యమనేది బ్లడ్ లో వుంటది , బాడీలో వుంటది, ఫ్యామిలీలో వుంటది, గుండెల్లో నుంచి వచ్చే దమ్ములో వుంటదని ఎదవ సొల్లు చెప్పడం నాకు ఇష్ట‌ముండ‌దురా``  అంటూ వీర‌లెవిల్లో ఓ డైలాగు చెప్పేశాడు. మ‌న స్టార్ కథానాయ‌కులు ఎక్కువ‌గా  బ్లడ్, ఫ్యామిలీ, దమ్ము.. అంటూ డైలాగులు చెబుతుంటారు. ఆ క‌థానాయ‌కులంద‌రిపైనా  ఇప్పుడు రామ్ సెట్టైర్ వేసిన‌ట్టయింది. నిన్న‌టినుంచి ప‌రిశ్ర‌మ‌లో  ఇదే విష‌యం గురించి మాట్లాడుకొంటున్నారు.  ఇలాంటి డైలాగులు లేనిపోని కాంట్ర‌వ‌ర్సీల‌కి దారితీసే అవ‌కాశ‌ముంద‌న్న అభిప్రాయాలు ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ