Advertisementt

‘మోసగాళ్లకు మోసగాడు’ ముస్తాబవుతున్నాడు!

Sun 03rd May 2015 07:02 AM
mosagallaku mosagadu,sudheer babu,krishna,satish vegesna  ‘మోసగాళ్లకు మోసగాడు’ ముస్తాబవుతున్నాడు!
‘మోసగాళ్లకు మోసగాడు’ ముస్తాబవుతున్నాడు!
Advertisement
Ads by CJ

చెడు చేసే వాడు ఆలోచించాలి. మంచి చేసే వాడు చేసుకుంటూ పోవాలనేది క్రిష్ నమ్మిన సిద్ధాంతం. దేవుడి అండతో చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. నందిని కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ‘12 శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారుచేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాల్ని దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యాయి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వినోదానికి ప్రాధాన్యముంటుంది. సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. మణికాంత్ ఖాద్రి స్వరాలకు చక్కటి స్పందన లభిస్తుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. సప్తగిరి, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,  పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ