Advertisementt

'ధనలక్ష్మితలుపు తడితే' టీజర్ లాంచ్..!

Sat 02nd May 2015 10:59 PM
dhanalakshmi thalupu thadithe,teaser launch,dhanraj,ramasathyanarayana  'ధనలక్ష్మితలుపు తడితే' టీజర్ లాంచ్..!
'ధనలక్ష్మితలుపు తడితే' టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

ధనరాజ్‌, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధుతులాని, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, నాగబాబు, తాగుబోతు రమేష్‌ ముఖ్యతారాగణంగా భీమవరం టాకీస్‌ పతాకంపై మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తుమ్మల రామసత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా 'ధనలక్ష్మి తలుపు తడితే'. ఈ చిత్రం టీజర్ లాంచ్ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోషం సురేష్, డార్లింగ్ స్వామి, నందినిరెడ్డి, దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, వేమూరి సత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామసత్యనారాయణ మాట్లాడుతూ "సినిమా స్క్రిప్ట్ చాలా బావుంది. ఎంత బడ్జెట్ లో చిత్రాన్ని నిర్మించాలో ముందుగానే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. చిన్న సినిమాగా మొదలు పెట్టినా క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రంగా తీసాం. డైరెక్టర్ కి మొదటి సినిమా అయిన గొప్పగా చిత్రీకరించాడు" అని చెప్పారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "అచ్యుత్ నాకు 5 సంవత్సరాలుగా పరిచయం. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ధనరాజ్ ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ లో భాగం అవ్వడం సంతోషకరమైన విషయం. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని తెలిపారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ "ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ ఎంత ఉత్సాహంతో చిత్రీకరించారో తెలుస్తుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ "టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమా టైటిల్ లో పాజిటివిటి ఉంది. ధనరాజ్ ప్రొడక్షన్ లో మంచి రేంజ్ కు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ "సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసాను అధ్బుతంగా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ ను సాధిస్తుంది" అని అన్నారు .

ధనరాజ్ మాట్లాడుతూ "అచ్యుత్ గారితో 'సచ్చినోడి ప్రేమకథ' అనే చిత్రాన్ని మొదలు పెట్టాం కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. మరలా ఆయన ఈ సినిమా స్టొరీ వినిపించారు. చాలా నచ్చింది అందుకే ప్రొడక్షన్ లో కూడా భాగస్తుడినయ్యాను. ఈ సినిమాకి కథే హీరో. మ్యూజిక్ డైరెక్టర్ భోలే కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది. ఈ నెలలోనే ఆడియో రిలీజ్ చేసి మే చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ "ఈ సినిమాను చాలా బాధ్యతతో తీశాను. సినిమా చూసినవారికి మంచి అనుభూతి కలుగుతుంది. భోలే మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు" అని చెప్పారు.

"ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు. చాలా కేర్ తీసుకొని చిత్రాన్ని నిర్మించారు" అని హీరోయిన్ శ్రీముఖి, మనోజ్ నందం, సంగీత దర్శకుడు భోలే తెలిపారు. 

ఈ చిత్రానికి ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`సంభాషణలు`దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ