ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్న రెండు సినిమాలు ఆడియన్స్‌కి డబుల్ స్ట్రోక్ ఇచ్చాయి. కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయబోతున్నామని గత వారం రోజులుగా సి.కళ్యాణ్ పబ్లిసిటీ చేస్తున్నప్పటికీ చెన్నయ్‌లో ఈ చిత్రానికి వున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చివరి క్షణంలో రిలీజ్‌ని నిలిపి వేశారు. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తెలుగులో రిలీజ్ అవుతున్న ‘గంగ’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని అయోమయ పరిస్థితిలో నుంచి మే 1కి రిలీజ్ చేస్తామని బెల్లంకొండ సురేష్ ప్రకటించడంతో ఈ సినిమాకి విముక్తి కలిగిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి వున్న సవాలక్ష సమస్యలు వుండడం వల్ల ఈరోజు రిలీజ్ క్యాన్సిల్ అయింది. ఇలా రెండు డబ్బింగ్ సినిమాల వల్ల మే 1 రిలీజ్ చెయ్యాలనుకున్న చాలా తెలుగు సినిమాలకు ఎఫెక్ట్ పడిరది. రెండు పెద్ద సినిమాలు రిలీజ్ రోజు షోలు పడకుండా క్యాన్సిల్ అవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ‘ఉత్తమ విలన్’ చిత్రానికి 17 కోట్ల రూపాయలు ఫైనాన్షియర్స్‌కి చెల్లించాల్సి వుండడం వల్ల అర్ధాంతరంగా రిలీజ్‌ని ఆపేశారు. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ‘గంగ’ విషయానికి వస్తే ఈరోజు మ్యాట్నీ నుంచి షోలు పడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఈ రెండు సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్‌తో మార్నింగ్ షోకి థియేటర్స్‌కి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. రెండు పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో ఇంత గందరగోళ పరిస్థితి ఎదురవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.