Advertisementt

'జేమ్స్ బాండ్' ఫస్ట్ లుక్ లాంచ్..!

Thu 30th Apr 2015 09:41 AM
james bond movie,allari naresh,sakshi chowdari,rambrahmam,sai kishore  'జేమ్స్ బాండ్' ఫస్ట్ లుక్ లాంచ్..!
'జేమ్స్ బాండ్' ఫస్ట్ లుక్ లాంచ్..!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా ఏ.కె ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై సాయికిషోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'జేమ్స్ బాండ్' నేను కాదు నా పెళ్ళాం అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత రామబ్రహ్మం మాట్లాడుతూ "ఈ చిత్రం ఏ.కె ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న నాలుగో సినిమా. సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మే12 న ఆడియో లాంచ్, మే మూడవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ "ఇంత పెద్ద బ్యానర్ లో పని చేయడానికి అవకాసం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు. యాక్షన్ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సాక్షి చౌదరి మాట్లాడుతూ "ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. యాక్షన్, లవ్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. సాంగ్స్ చాలా బాగా కుదిరాయి" అని చెప్పారు.

సాయికిషోర్ మాట్లాడుతూ "కొద్దిపాటి డ్రామాతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మన్మధుడు లాంటి అబ్బాయికి పవర్ ఫుల్ డాన్ తోడైతే ఏం జరుగుతుందో అనేదే కథ. ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించాం" అని అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావుల, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ