Advertisementt

‘గబ్బర్‌’లో నటించడం హ్యాపీగా వుందంటున్న సుమన్‌

Thu 30th Apr 2015 08:04 AM
actor suman,hindi movie gabbar is back,akshay kumar,director krish,suman in gabbar is back,gabbar is back on 1st may  ‘గబ్బర్‌’లో నటించడం హ్యాపీగా వుందంటున్న సుమన్‌
‘గబ్బర్‌’లో నటించడం హ్యాపీగా వుందంటున్న సుమన్‌
Advertisement
Ads by CJ

1977లో ‘నీచల్‌కులం’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తరంగిణి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో సుమన్‌. అందాల నటుడిగానే కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌లో నిష్ణాతుడిగా అందరి ప్రశంసలు అందుకుంటూ తెలుగులో హీరోగా ఎదిగారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన సుమన్‌ కెరీర్‌లో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాలు అతను చేసిన మరపురాని పాత్రల్లో ముఖ్యమైనవి. నాలుగు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ తెలుగులోనే సుమన్‌కి మంచి గుర్తింపు లభించింది. శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘శివాజీ’ చిత్రంలో విలన్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు సుమన్‌. తాజాగా అక్షయ్‌కుమార్‌ హీరోగా ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రం ద్వారా విలన్‌గా బాలీవుడ్‌లో పరిచయమవుతున్నారు సుమన్‌. ఈ చిత్రం ఈ శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం ఫిలిం ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సుమన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘అక్షయ్‌కుమార్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో సంజయ్‌లీలా బన్సాలీ, షబీనా ఖాన్‌ నిర్మిస్తున్న ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రం ద్వారా నేను బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అవుతున్నాను. క్రిష్‌గారి సినిమాలు చూసినపుడు తప్పకుండా ఆయన డైరెక్షన్‌లో అవకాశం వస్తే సినిమా చెయ్యాలనుకున్నాను. అయితే హిందీ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. తమిళ్‌లో మురుగదాస్‌ తీసిన ‘రమణ’ చిత్రాన్ని తెలుగులో ‘ఠాగూర్‌’గా రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిందీలో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’గా రీమేక్‌ చేశారు. ఒరిజినల్‌ వెర్షన్‌ రమణలో చాలా మార్పులు చేసి, నేను చేసిన విలన్‌ క్యారెక్టర్‌ని పక్కా నార్త్‌ స్టైల్‌లో వుండేలా డెవలప్‌ చేశారు. ఇందులో రెండు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. అక్షయ్‌కుమార్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌ చెయ్యడం అంటే చాలా టఫ్‌ అని చెప్పాలి. ఇండియన్‌ సినిమాలో రిస్క్‌ తీసుకొని ఫైట్స్‌ చేసే ఏకైక హీరో అక్షయ్‌కుమార్‌ అని అభిప్రాయం. మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన హీరో. నేను కూడా మార్షల్‌ ఆర్ట్స్‌లో వున్నాను కాబట్టి మా ఇద్దరికీ బాగా సెట్‌ అయి ఒక అండర్‌స్టాండిరగ్‌కి వచ్చి ఫైట్స్‌ చెయ్యడం జరిగింది. గాల్లో ఎగరడం, ఎక్కడి నుంచో దూకడం వంటివి కాకుండా చాలా నేచురల్‌గా, మార్షల్‌ ఆర్ట్స్‌ని లైక్‌ చేసే వారికి నచ్చేలా ఫైట్స్‌ని తియ్యడం జరిగింది. చంద్రమహేష్‌ ‘రెడ్‌ అలర్ట్‌’ అనే సినిమాను నాలుగు భాషల్లో తీశారు. ఈ నాలుగు వెర్షన్స్‌లో పోలీస్‌ కమిషనర్‌గా చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేశాను. ఇంతకుముందు రెండు భాషల్లో తీసిన సినిమాల్లో నటించాను. కానీ, ఫస్ట్ట్‌ టైమ్‌ నాలుగు భాషల్లో తీసిన సినిమాలో చేశాను. సౌత్‌లో నాలుగు భాషల్లో చేశాను, హిందీలో కూడా సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్న టైమ్‌లో సంజయ్‌ లీలా బన్సాలి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. హిందీలో యాక్ట్‌ చెయ్యడం మీకు ఇంట్రెస్టేనా అని అడిగారు. డెఫినెట్‌గా చేస్తాను అని చెప్పాను. అప్పుడు కో ప్రొడ్యూసర్‌ షబీనా ఖాన్‌గారు లైన్‌లోకి వచ్చి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పారు. ఆ తర్వాత నేను ముంబాయి వెళ్ళి సబ్జెక్ట్‌ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్‌ టైమ్‌ శివాజీలో విలన్‌గా చేస్తున్నానని తెలిసినపుడు సుమన్‌కి డివోషనల్‌ ఇమేజ్‌ వుంది కదా, చాలా సాఫ్ట్‌గా వుంటాడు కదా విలన్‌గా ఎలా మెప్పించగలడు అనే డౌట్‌ చాలా మంది ఎక్స్‌ప్రెస్‌ చేశారు. అయితే వారందరికీ సినిమా రానివ్వండి వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ కోసం నా ఫేస్‌లో కొన్ని మార్పులు చేశారు. ఆ సినిమా చేసేటపుడే తప్పకుండా ఇది ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ అవుతుంది అనుకున్నాను. రిలీజ్‌ తర్వాత ఆడియన్స్‌ కూడా నన్ను విలన్‌గా యాక్సెప్ట్‌ చేశారు. అందరి నుంచి మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. శివాజీ హిందీలోకి డబ్‌ అయిన తర్వాత హిందీలో సినిమా చేస్తారా అని నాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. హిందీ సినిమా అంటే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టచ్‌ చేస్తుంది కాబట్టి మంచి బేనర్‌, మంచి డైరెక్టర్‌, ప్రాపర్‌ మేకింగ్‌, ప్రాపర్‌ రిలీజ్‌, ప్రాపర్‌ పబ్లిసిటీ.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాలుగైదు ప్రాజెక్టులు వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్‌ చేశాను. ఈ సినిమా విషయానికి వస్తే మంచి బేనర్‌, మాస్‌ హీరో అక్షయ్‌కుమార్‌, నా క్యారెక్టర్‌ అన్నీ నచ్చాయి కాబట్టి ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ ముంబాయి, పూనాలలో చేశాం. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు అక్షయ్‌కుమార్‌ నాకు కాంప్లిమెంట్స్‌ ఇవ్వడం నేను మర్చిపోలేను. ఆయన ఫైట్స్‌ చాలా నేచురల్‌గా వుంటాయి. సేమ్‌ టైమ్‌ టఫ్‌గా కూడా వుంటాయి. ఈ ఏజ్‌లో కూడా మీరు బాగా చేస్తున్నారని నన్ను అప్రిషియేట్‌ చేశారు. అక్షయ్‌ అంత ఈజీగా ఎవరికీ కాంప్లిమెంట్స్‌ ఇవ్వరని తెలిసింది. అలాంటి వ్యక్తి నన్ను అప్రిషయేట్‌ చెయ్యడం హ్యాపీగా అనిపించింది. రేపు ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఇకముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు చెయ్యాలని వుంది. తప్పకుండా చేస్తాను’’ అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ