Advertisementt

రాఘవ లారెన్స్‌, బెల్లంకొండ సురేష్‌ల ‘గంగ' రిలీజ్ కి రెడీ

Wed 29th Apr 2015 11:10 AM
lawrence new movie muni 3,telugu movie ganga,ganga movie releasing on 1st may,tapasee,nitya menon  రాఘవ లారెన్స్‌, బెల్లంకొండ సురేష్‌ల ‘గంగ' రిలీజ్ కి రెడీ
రాఘవ లారెన్స్‌, బెల్లంకొండ సురేష్‌ల ‘గంగ' రిలీజ్ కి రెడీ
Advertisement
Ads by CJ

రాఘవ లారెన్స్‌ హీరోగా నటించి దర్శకత్వం వహించగా ‘కాంచన’(ముని2) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించి ‘గంగ’(ముని3) మే 1న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ` ‘‘మా బేనర్‌లో ‘కాంచన’గా వచ్చిన ముని 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘గంగ’గా నిర్మించిన ముని 3 చిత్రాన్ని మే 1న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘గంగ’ చిత్రం కూడా పెద్ద హిట్‌ అయి మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీగా నిలుస్తుంది. రాఘవ లారెన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌, డైరెక్టర్‌గా ఆయన టేకింగ్‌, తాప్సీ, నిత్య మీనన్‌ల గ్లామర్‌ సినిమాకి పెద్ద ఎస్సెట్స్‌ అవుతాయి. ఈ చిత్రం తర్వాత త్వరలోనే ‘ముని4’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం’’ అన్నారు.

రాఘవ లారెన్స్‌, తాప్సీ, నిత్యమీనన్‌, కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సమర్పణ: బెల్లంకొండ సురేష్‌, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ