Advertisementt

‘లయన్‌’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ అయింది

Wed 29th Apr 2015 05:25 AM
balakrishna new movie lion,lion movie on 8th may,mani sharma,rudrapati ramana rao  ‘లయన్‌’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ అయింది
‘లయన్‌’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ అయింది
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రుద్రపాటి ప్రేమలత సారధ్యంలో, జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లయన్‌’. ఈ చిత్రాన్ని మే 8న ఉదయం 10.04 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రుద్రపాటి రమణరావు, దర్శకుడు సత్యదేవ, నటులు ఆలీ, సమీర్‌, కెమెరామెన్‌ వెంకటప్రసాద్‌, ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

రుద్రపాటి రమణారావు: మా ‘లయన్‌’ చిత్రాన్ని మే 8న ఉదయం 10.04 గంటలకు విడుదల చేస్తున్నాం. నిజానికి మే 1న రిలీజ్‌ చేద్దామనుకున్నాం. డిటిఎస్‌ మధుసూదనరెడ్డిగారు హఠాన్మరణం చెందడం వల్ల వర్క్‌ డిలే అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది. పక్కాగా మే 8న సినిమాని రిలీజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. మణిశర్మగారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. బాలకృష్ణగారి కాంబినేషన్‌లో ఆయన చేసిన సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయో అందరికీ తెలిసిందే. ‘లయన్‌’ కూడా ఆడియో పరంగా, సినిమాపరంగా ఆ సినిమాల స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. 

సమీర్‌: బాలకృష్ణగారి సినిమా అంటే ఫ్యాన్స్‌ అందరికీ ఒక పండగలా వుంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే వారికి ఇంకా పెద్ద పండగ. బాలకృష్ణగారి సినిమా రిలీజ్‌ అవుతోందంటే ఒక కిక్‌లా వుంటుంది. సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. 

ఆలీ: ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ సత్యదేవగారు చాలా బాగా హ్యాండిల్‌ చేశారు. ఈ సినిమా బాలకృష్ణగారికి పూర్తి యాప్ట్‌. సాధారణంగా కొత్త డైరెక్టర్స్‌కి పెద్ద హీరోలు అంత త్వరగా ఛాన్స్‌ ఇవ్వరు. కానీ, సత్యదేవ మీద వున్న పూర్తి నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు బాలకృష్ణగారు. ఈ సినిమాలో పెద్ద హైలైట్‌గా చెప్పాల్సింది ఒక ట్రైబల్‌ ఫైట్‌ గురించి. ఈ ఫైట్‌ని రామ్‌, లక్ష్మణ్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశారు. 11 రోజులపాటు ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన ఫైట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాలకృష్ణగారు చాలా ఎక్స్‌లెంట్‌గా చేసిన ఈ రిస్కీ ఫైట్‌ కోసం ఆడియన్స్‌ ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారు. 

రామ్‌, లక్ష్మణ్‌: ఈ సినిమాలోని ఫైట్స్‌ అన్నీ దేనికవే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుంటాయి. ముఖ్యంగా ఈ ట్రైబల్‌ ఫైట్‌ కాన్సెప్ట్‌ డైరెక్టర్‌గారు చెప్పిందే. మా ఫైటర్స్‌ ఈ ఫైట్‌ బాగా రావడం కోసం చాలా రిస్క్‌ చేశారు. మేమందరం ఎంతో ఇబ్బంది పడ్డాం. ఫైనల్‌గా ఫైట్‌ చాలా బాగా వచ్చింది. బాలకృష్ణగారు ఆ ఏజ్‌లో కూడా ఎంతో ఉత్సాహంగా ఫైట్‌ సీక్వెన్స్‌ని ఎలాంటి డూప్‌ లేకుండా చేశారు. రేపు ఆడియన్స్‌ ఈ ఫైట్‌ గురించి స్పెషల్‌గా చెప్పుకుంటారు. ఇంత మంచి సినిమాకి ఫైట్స్‌ కంపోజ్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చిన బాలకృష్ణగారికి, సత్యదేవగారికి, రమణరావుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

సత్యదేవ: గత సంవత్సరం జూన్‌లో ఈ చిత్రాన్ని స్టార్ట్‌ చేశాం. మే 8కి రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా రిలీజ్‌ కోసం బాలకృష్ణగారి ఫ్యాన్స్‌ ఎంతో వెయిట్‌ చేస్తున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వుంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంతో కష్టపడ్డారు. అందరూ తమ సొంత సినిమా అనే ఫీలింగ్‌తో వర్క్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకంతో వున్నాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ