Advertisementt

మేలో రిలీజ్‌ అవుతున్న ‘అగ్నిసాక్షిగా...’

Wed 29th Apr 2015 05:06 AM
  మేలో రిలీజ్‌ అవుతున్న ‘అగ్నిసాక్షిగా...’
మేలో రిలీజ్‌ అవుతున్న ‘అగ్నిసాక్షిగా...’
Advertisement
Ads by CJ

విసురెడ్డి, ఇషా, నందకిషోర్‌`త్రివేణి జంటలుగా నల్లపాటి ప్రసాద్‌, శిరీష సమర్పణలో శ్రీ ప్రకాశ షోస్‌ పతాకంపై ఆర్‌.ఆర్‌. జరుగుల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘అగ్నిసాక్షిగా...’ పెళ్ళాడండి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సమ్మర్‌ కానుకగా మే నెలలో విడుదలవుతుంది. 30 సంవత్సరాలుగా నాటక రంగంలో వుంటూ ఎన్నో ప్రభుత్వ అవార్డులను, రివార్డులను సాధించి, స్టార్‌ రైటర్స్‌ పరుచూరి బ్రదర్స్‌ వద్ద శిష్యరికం చేసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు రచయితగా పని చేసిన ఆర్‌.ఆర్‌. జరుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

నిర్మాత, దర్శకుడు ఆర్‌.ఆర్‌. జరుగుల మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల హృదయాల్ని టచ్‌ చేసిన ప్రతి చిత్రం హిట్‌ అయ్యింది. హిట్‌ అయిన ప్రతి సినిమా మెదడును టచ్‌ చేయదు. కానీ గుండెల్ని`మెదడుని టచ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మన హిందు దేశంలో తాళికి ఎంతో విలువ, ప్రాముఖ్యత వుంది. అలాంటి తాళికి ఈ రోజుల్లో విలువ లేకుండా పోయింది. ప్రేమకి`పెళ్ళికి ఎంత ప్రాముఖ్యత వుందో ఈ చిత్రంలో క్లియర్‌గా చూపించడం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని ‘అగ్నిసాక్షిగా..’ పెళ్ళాడండి అని ఈ చిత్రం ద్వారా ఒక మంచి మెసేజ్‌ని చెప్తున్నాం’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత గొట్టిపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ  ‘‘ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ కలగలసిన ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇది. రష్‌ చూసాం. ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. బిజినెస్‌ రెస్పాన్స్‌ చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు ఫినిష్‌ చేసి మేలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

కొండవలస, మల్లాది శివన్నారాయణ, పి.ఎ.పి. ఆచార్య, ప్రభావతి, లోహిత్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వంశీ`గణేష్‌, ఫొటోగ్రఫీ: తిరుపతిరెడ్డి కోటా, కన్నా, కొరియోగ్రఫీ: ‘ఢీ’ శ్రీను, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: గొట్టిపాటి కోటేశ్వరరావు, డా.పి.ఎ.పి. ఆచార్య, పోపూరి నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: నిర్మాత, దర్శకత్వం: ఆర్‌.ఆర్‌. జరుగుల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ