తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం తెలుగు హక్కులను తీవ్ర పోటీ నడుమ ‘శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్’ సొంతం చేసుకోవడం తెలిసిందే. తెలుగు`తమిళ భాషల్లో తిరుగులేని ‘మెగా ప్రొడ్యూసర్’గా వెలుగొందుతున్న ఆర్.బి.చౌదరి సమర్పణలో.. సూపర్‌గుడ్ ఫిలింస్‌తో సంయుక్తంగా` తన మిత్రుడు ‘ప్రసాద్ సన్నితి’తో కలిసి యువ నిర్మాత ‘తమటం కుమార్‌రెడ్డి’ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నామన శంకర్‌రావు ఈ చిత్రానికి సహ నిర్మాత. తమిళ సూపర్‌స్టార్ విజయ్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, క్రేజీ కథానాయకి కాజల్, డా॥బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరాం, సురేఖావాణి, ప్రదీప్‌రావత్, సంపత్‌రాజ్ ముఖ్య తారాగణంగా ఆర్.టి.నీసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట కాసుల వర్షం కురిపించి 120 కోట్లకు పైగా వసూలు చేసి, విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు పలు టైటిల్స్ పరిశీలించినప్పటికీ.... చివరికి ‘జిల్లా’ పేరునే ఫిక్స్ చేసారు.
నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్ సన్నితి మాట్లాడుతూ.. ‘‘తమిళలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రానికి తెలుగులో ఏ పేరు పెడితే బాగుంటుందా అని చాలా తర్జనభర్జన చేసాం. చాలా పేర్లు అనుకున్నాం. చివరికి ‘జిల్లా’ పేరు తెలుగుకి కూడా బాగుంటుందని అందరూ అభిప్రాయపడడం, మా ఆర్.బి.చౌదరిగారు కూడా ఆ పేరుకే మొగ్గు చూపడంతో.. ‘జిల్లా’ పేరునే ఖరారు చేసాం. ఆర్.బి.చౌదరిగారు వంటి లెజండరీ ప్రొడ్యూసర్ సమర్పణలో ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. డా॥బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై తెలుగు వెర్షన్ కోసం కొన్ని సన్నివేశాల్ని ప్రత్యేకంగా చిత్రీకరించాం. ఇటీవలే డా॥బ్రహ్మానందం తన డబ్బింగ్ పార్ట్‌ను పూర్తి చేసారు. తమిళ టాప్ స్టార్స్‌లో ఒకరైన ఆర్.బి.చౌదరిగారబ్బాయి జీవా ఈ చిత్రంలో మెరుపులా కనిపిస్తారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా.. తెలుగువారికి సుపరిచితులైన తారాగణంతో రూపొందిన ‘జిల్లా’ తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది. త్వరలోనే ట్రయిలర్స్ రిలీజ్ చేయనున్నాం’ అన్నారు.
మహత్ రాఘవేంద్ర, నివేదా థామస్, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: గణేష్ రాజవేలు, ఎడిటింగ్: డాన్ మ్యాక్స్, మ్యూజిక్: డి.ఇమాన్, పాటలు: వెన్నెలకంటి, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహనిర్మాత: నామన శంకర్‌రావు, నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్ సన్నితి, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాణ సంస్థలు: సూపర్‌గుడ్ ఫిలింస్`శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఆర్.టి.నేసన్!!