ఒకొక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది. నటిగా మంచు లక్ష్మికి కూడా ఓ డ్రీమ్ ఉంది. అదేంటంటే... రాజమౌళి దర్శకత్వంలో `ఝాన్సీ లక్ష్మీబాయి` తెరకెక్కాలనీ, అందులో తాను లీడ్ రోల్ పోషించాలనేది లక్ష్మి కల. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది లక్ష్మి. ఇప్పటికే నటనలో తిరుగులేదనిపించుకొందామె. `అనగనగా ఓ ధీరుడు`, `గుండెల్లో గోదారి`, చందమామ కథలు` చిత్రాల్లో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంది. లక్ష్మికి ఎలాంటి పాత్ర అప్పజెప్పినా చేయగలదు అనే భరోసా దర్శకులకి ఇచ్చేసింది. సో... ఆమె డ్రీమ్ ఆశ్చర్యమేమీ కలగించడం లేదు. మరి రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఆమెకి ఎప్పుడొస్తుందో చూడాలి. మే `1`న ఆమె `దొంగాట`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.