Advertisementt

వరుణ్ తేజ్, పూరి సినిమా ముహూర్తం అప్పుడే..!

Sun 26th Apr 2015 03:41 PM
varuntej,puri jagannadh,nagababu,kanche,mukunda  వరుణ్ తేజ్, పూరి సినిమా ముహూర్తం అప్పుడే..!
వరుణ్ తేజ్, పూరి సినిమా ముహూర్తం అప్పుడే..!
Advertisement
Ads by CJ

కథానాయకుడిగా వరుణ్ తేజ పరిచయం చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయాల్సింది. అనుకోని కారణాల వలన చేయడం కుదరలేదు. వరుణ్ కోసం రాసిన కథతో పూరి హార్ట్ ఎటాక్ చిత్రాన్ని తీశారు. ముకుందతో వరుణ్ తేజ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ముకుంద తర్వాత కంచె చేస్తున్నాడు. మూడవ చిత్రాన్ని పూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నారు. 

జూన్ నెలలో ముహూర్త కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించి, తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని సి.కళ్యాణ్  తెలిపారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం రూపొందనుంది. పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కలయికలో రూపొందబోయే చిత్రం కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ