Advertisementt

ప్రేమ‌'ర‌థం' ఎక్కునున్న అల్లు అర్జున్‌?

Sun 26th Apr 2015 02:48 PM
allu arjun boyapati movie,ratham title for allu arjun,bunny new movie   ప్రేమ‌'ర‌థం' ఎక్కునున్న అల్లు అర్జున్‌?
ప్రేమ‌'ర‌థం' ఎక్కునున్న అల్లు అర్జున్‌?
Advertisement
Ads by CJ
బోయ‌పాటి శ్రీను-అల్లు అర్జున్ చిత్రానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. యాక్ష‌న్‌తో కూడిన ఒక ప‌క్కా ప్రేమ‌క‌థ‌ని తెర‌కెక్కించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు బోయ‌పాటి శ్రీను. ఆ క‌థ‌ని బ‌న్నీకి చెప్పి ఓకే అనిపించుకొన్నాడు. రేపోమాపో సెట్స్‌పైకి  వెళ్ల‌బోతున్నారు. స్క్రిప్టు ప‌నులు కొలిక్కి రావ‌డంతో   ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల గురించి అన్వేష‌ణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. దాంతో పాటు చిత్రానికి పేరు గురించి కూడా సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌థ రీత్యా `రథం` అనే పేరయితే బాగుంటుంద‌ని బోయ‌పాటి అభిప్రాయంగా తెలుస్తోంది.  ఆ పేరు బ‌న్నీకి కూడా న‌చ్చ‌డంతో దాదాపుగా అదే పేరు ఖ‌రారు చేయొచ్చ‌ని స‌మాచారం. `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`తో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకొన్న బ‌న్నీ... ఈసారి యువ‌త‌రాన్ని అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా బోయ‌పాటి సినిమా చేస్తున్నారు. ఇందులో బ‌న్నీ స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టిస్తార‌ని తెలుస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ