శ్రీకాంత్, సోనియా మాన్ హీరోహీరోయిన్లుగా మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఢీ అంటే ఢీ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీకాంత్, హీరోయిన్ సోనియా మాన్, దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు, సినిమాటోగ్రాఫర్ సి.హెచ్.గోపీనాథ్, రచయిత రాజేంద్రకుమార్, సహనిర్మాత సి.ఎస్.రెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాంత్: మే 1న మా ‘ఢీ అంటే ఢీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. జొన్నలడ్డ శ్రీనివాసరావు నిర్మాతగా, దర్శకుడుగా ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్‌తో చేసిన సినిమా ఇది. ఇందులో మెయిన్‌గా బ్రహ్మానందంగారి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. తండ్రిగా, 9 ఏళ్ళ కొడుకుగా రెండు పాత్రల్లో చాలా అద్భుతంగా చేశారు. కనల్‌కణ్ణన్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, స్వర్గీయ చక్రి మ్యూజిక్ సినిమాకి ప్లస్ అవుతాయి. నిర్మాతగా జొన్నలగడ్డకి, హీరోగా నాకు ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన సోనియామాన్‌కి ఇది తెలుగులో ఫస్ట్ మూవీ. ఆ అమ్మాయి ఆల్రెడీ పంజాబీ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
సోనియా మాన్: ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. చాలా మంచి స్క్రిప్ట్. అందరూ నాకెంతో సపోర్ట్ చేశారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీనివాసరావుగారికి థాంక్స్. శ్రీకాంత్‌గారు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ బాగుంటుంది. నా డైలాగ్స్ కూడా చాలా నైస్‌గా వుంటాయి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
రాజేంద్రకుమార్: డైరెక్టర్‌గా వున్న జొన్నలగడ్డ ప్రొడ్యూసర్‌గా మారి ఈ సినిమా టేకప్ చేయడానికి, కంప్లీట్ చెయ్యడానికి కారణం స్క్రిప్ట్. దాన్ని నమ్ముకొని ఈ సినిమా చేశాం. ఖడ్గంలో శ్రీకాంత్‌గారు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలాంటి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఈ సినిమాలో దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఒక కాన్వెంట్ టీచర్‌గా పిల్లలతో కలిసి ఎలా చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ఇందులో ఛోటా భీమ్ అనే క్యారెక్టర్ కోసం బ్రహ్మానందంగారిని అనుకున్నాం. ఆయనకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే నాకే చాలా గమ్మత్తుగా వుంది ఈ క్యారెక్టర్. ఎన్ని రోజులయినా ఈ సినిమా నేను చేస్తాను అని ఎంతో ఎంకరేజ్ చేశారు. థియేటర్‌లో ఆ క్యారెక్టర్ చూసి ఆడియన్స్ బాగా థ్రిల్ అవుతారు. టోటల్‌గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుండే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
జొన్నలగడ్డ శ్రీనివాసరావు: ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కావడానికి నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో సహకరించారు. భూపతిరాజాగారు చెప్పిన కథను మా ఫ్రెండ్స్‌కి వినిపిస్తే ఈ సినిమా మనమే చేద్దాం. మీరు ధైర్యంగా స్టార్ట్ చేయమని మా సహనిర్మాతలు సి.ఎస్.రెడ్డి, జి.జ్యోతిక ప్రోత్సహించారు. కోడైరెక్టర్‌గా వున్నప్పటి నుంచి శ్రీకాంత్‌గారు నాకు పరిచయం. కథ నచ్చి చేద్దాం అన్నారు. రెండు గంటలు ఏ సీన్‌కి ఆసీన్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుంది. మేం ఇంత హ్యాపీగా వుండడానికి కారణం బ్రహ్మానందంగారు చేసిన డూయల్ రోల్. కొడుకు క్యారెక్టర్ చేసే కామెడీ మామూలుగా వుండదు. ట్రైలర్స్ చూసిన తర్వాత బ్రహ్మానందంగారు కూడా ఆశ్చర్యపోయి అసలు అలా ఎలా చేశారు అన్నారు. ఇక పోసానిగారు ఇందులో నాలుగు సీన్స్ చేశారు. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటాయి ఆ సీన్స్. ఇందులో కామెడీతోపాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. నా కోసం ఈ చిత్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టెక్నీషియన్స్ పనిచేశారు. వారి రుణం తప్పకుండా తీర్చుకుంటాను. ఈ సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాము.
శ్రీకాంత్, సోనియా మాన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్, బ్రహ్మాజీ, సత్యకృష్ణ, జ్ఞానీస్, జీవా, అదుర్స్ రఘు, వేణుగోపాల్, గుండు హనుమంతరావు, దువ్వాసి మోహన్, టార్జాన్, నర్సింగ్ యాదవ్, కాదంబరి కిరణ్ నటించిన ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, సంగీతం: చక్రి, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.హెచ్.గోపీనాథ్, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, స్టిల్స్: ధర్మా బ్రదర్స్, కోడైరెక్టర్స్: సిప్పీ, రవి, సహనిర్మాతలు: సి.ఎస్.రెడ్డి, జి.జ్యోతిక, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.