మాస్టర్ జితేష్ సమర్పణలో నవదీప్ ఫిలిం క్రియేటివ్ పతాకంపై కమల్ కామరాజ్, షాయాజీషిండే ప్రధాన పాత్రలుగా జగదీష్ వటర్కర్ దర్శకత్వంలో, రాజ్ పచ్‌ఘరే నిర్మించిన మెసేజ్ ఒరియంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ‘ఫాదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదలై ప్రేక్షకులను మెప్పించి..మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ పచ్‌ఘరే మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..‘‘ఇటీవల జరిగిన ఏడవ నాసిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ చిల్డ్రన్ మూవీ అవార్డ్‌ని సొంతం చేసుకున్న మా ఈ ‘ఫాదర్’ మూవీ ఏప్రిల్ 24న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి సినిమా అంటుంటే చాలా గర్వంగా ఉంది. సినిమా తీశాము అంటే..అందులో ఎంతో కొంత ప్రేక్షకులకి మంచి చేసే అంశాలుండాలనే ధ్యేయంతో ఈ చిత్రం చేయడం జరిగింది. మేం అనుకున్నట్లుగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ స్ఫూర్తితో ఇంకా మంచి సినిమాలు చేస్తామని ప్రేక్షకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరోసారి ఈ చిత్రాన్ని ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు...’’ అని అన్నారు. చిత్రంలో నటించిన బాలనటీనటులు, చిత్ర యూనిట్..ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కమల్ కామరాజు, షాయాజీషిండే, జ్యోతి, సమీర్, ముస్తాఖాన్, వృశాలి, మాస్టర్ సాయి ప్రణీత్, బేబీ కావేరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎవ్.వి.ఎస్. నాయుడు, సంగీతం: యువరాజ్ మోరె, ఎడిటర్: మేనుగ శ్రీను, స్క్రీన్‌ప్లే`డైలాగ్స్: అనూప్ శ్రీవాత్సవ్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ కంట్రోలర్: టి. గంగాధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉజ్వల పచ్‌ఘరే
ప్రొడ్యూసర్: రాజ్ పచ్‌ఘరే
దర్శకత్వం: జగదీష్ వటర్కర్