Advertisementt

బుడుగు ఇన్స్పిరేషన్ తో 'బుడుగు2'..!

Fri 24th Apr 2015 02:45 PM
budugu movie,success meet,manmohan,sarika sreenivas,manchu lakshmi  బుడుగు ఇన్స్పిరేషన్ తో 'బుడుగు2'..!
బుడుగు ఇన్స్పిరేషన్ తో 'బుడుగు2'..!
Advertisement
Ads by CJ

సుదీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిల్మ్ ఇన్నోవేటీస్ ప్రై లిమిటెడ్ పతాకంపై మన్ మోహన్ దర్శకత్వంలో బాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'బుడుగు'. ఈ నెల 17న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మన్ మోహన్ మాట్లాడుతూ "రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో విడుదలయిన ఈ సినిమాకు  అనుకున్నదానికంటే చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో వచ్చిన రెస్పాన్స్ బావుంది. 8 సంవత్సరాల అబ్బాయికి, తన ఫ్యామిలీ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ 'యు' ఎక్స్ పెక్ట్ చేసాం కాని సౌండ్ ఎఫెక్ట్స్ చిన్న పిల్లలు బయపడే విధంగా ఉన్నాయని 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు. కమర్షియల్ మూవీస్ తీసే ఈరోజుల్లో తల్లితండ్రులకు మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని ఈ చిత్రాన్ని తీసాం. మంచు లక్ష్మి, శ్రీధర్, ప్రేమ్ బాబు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రేమ్ బాబు కి ఈ సినిమా ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. ఇంద్రజ ఈ సినిమాలో 'కీ' రోల్ ప్లే చేసింది. ముందు ఆ పాత్ర కోసం సీనియర్ ఆర్టిస్ట్స్ ను సంప్రదించినా ఇంద్రజ గారయితే ఫ్రెష్ ఫీల్ ఉంటుందని ఆమెను ఎన్నుకున్నాం. నిర్మాతలు కొత్తవారైనా ఎంతగానో సహకరించారు. మొదట నేను స్టొరీ లైన్ చెప్పినప్పుడు వారు చాలా ఎక్సైట్ అయ్యారు. కథ కొత్తగా ఉందని ఈ సినిమాను నిర్మించారు. సాయికార్తిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్   హైలైట్ గా నిలిచింది" అని చెప్పారు.   

నిర్మాత సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ "ఈ సినిమా విడుదలయ్యి రెండు వారాలు అయినా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ స్ఫూర్తితోనే హారర్, కామెడీ జోనర్ లో 'బుడుగు2' నిర్మించే ప్లాన్ లో ఉన్నాం" అని చెప్పారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ "కొంచెం బిజీగా ఉండడం వలన సినిమా ప్రమోషన్ లో భాగం కాలేకపోయాను. సినిమా ఇంత అధ్బుతంగా రావడానికి కారణం డైరెక్టర్ గారు. ఏ సీన్ లోను కాంప్రమైస్ అవ్వకుండా, దేనికి లొంగకుండా చాలా బాగా చిత్రీకరించారు. మొదట్లో తల్లి పాత్రలో నటించడానికి కొంచెం బయపడ్డాను కానీ ఈ సినిమాలో నా రోల్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. సోషల్ మీడియాలో అందరు గౌరవప్రదంగా అక్క అనేవారు కానీ ఈ సినిమా తరువాత అమ్మ అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. రెవెన్యూ గురించి ఆలోచించకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతకు, డైరెక్టర్ కు నా అభినందనలు" అని చెప్పారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ