Advertisementt

'365 days' ఆడియోను ఆవిష్కరించిన పూరి

Fri 24th Apr 2015 02:47 AM
365 days movie,365 days audio release,ramgopal varma,puri jagannath,vinayak,anaika sothi  '365 days' ఆడియోను ఆవిష్కరించిన పూరి
'365 days' ఆడియోను ఆవిష్కరించిన పూరి
Advertisement
Ads by CJ

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నందు, అనైక సోఠి జంటగా డి.వి. క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం '365 days'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో జరిగింది. నాగ్‌శ్రీవాత్సవ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూరి జగన్నాథ్‌ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 

రామ్‌గోపాల్‌వర్మ: ఒక జంట ఏమోషన్స్‌ ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ ప్లే రాసుకున్నాను. అదే నా ఓపినియన్‌ కూడా. ఇందులో ఎటువంటి డ్రెమటిక్‌ ట్విస్ట్‌లు ఉండవు. 365 సినిమా నాకు స్పెషల్‌ మూవీ. ఎటువంటి క్రైమ్‌ లేకుండా తీసినసినిమా ఇది. చాలా మంది నా పెళ్లెందుకు ఫెయిలైందని అడుగుతారు దానికి నేనిచ్చే సమాధానం ఒకటే. నాకు ఒక మంచి భార్య దొరికింది. నా భార్యకి ఒక చెడ్డ మొగుడు దొరికాడని మాత్రం చెబుతుంటాను.

పూరి జగన్నాథ్‌: మగాడు లేకుండా ఆడది బ్రతకలేదు. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు. వాళ్లిద్దరూ కలిసి అసలు బ్రతకలేరు. మనం ఫ్రెండ్‌ ఫిప్‌ కే విలువనిస్తాం. రామ్‌గారితో నాకు ఇరవై యేళ్ల నుండి అనుబంధం ఉంది. మా మధ్య ఏ గొడవలు లేవు. అంటే ఏ రిలేషన్‌ అయినా సేవ్‌ చేసుకుంటూ వస్తేనే ఉంటుంది. లేకుంటే ఏ రిలేషన్‌ అయినా ఉండదు.

నాగ్‌ శ్రీవాత్సవ్‌:  నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను కానీ రామ్‌ గోపాల్‌వర్మ వంటి దర్శకుడి సినిమాకి సంగీతం అందించడం సులువైన విషయం కాదు. మ్యూజిక్‌ గురించి అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి.  ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను 

నందు: దాదాపు పదేళ్ల తర్వాత నేను మళ్లీ చేస్తున్న లవ్‌ స్టోరి. నా మొదటి సినిమాలా ఫీలవుతున్నానని రామ్‌గారు నాతో అన్నారు. సినిమా తప్పకుండా నచ్చతుంది. 

అనైక సోరి:  రామ్‌గోపాల్‌వర్మ గారితో సత్య2 తర్వాత చేస్తున్న మూవీ. నాపై నమ్మకంతో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్‌. 

ఉత్తేజ్‌: రాముగారు తన సినిమాల్లో చేయించిన క్యారెక్టర్స్‌ అన్నీ పెళ్లికి విరుద్ధమైన క్యారెక్టర్స్‌. పెళ్లి అంటే అడ్జస్ట్‌మెంట్‌. లైఫ్‌లో బాగా సెటిల్‌ అయిన తర్వాతే పెళ్లి చేసుకోమని సలహానిస్తుంటాను.

కోనవెంకట్‌: రాముకి సెంటిమెంట్స్‌ లేవంటారు. కానీ ఈ సినిమాకి రాము అమ్మగారు సాంగ్‌ రిలీజ్‌ చేస్తే, అందరిని పెళ్లికి పిలిచాడు. 

సిరాశ్రీ: విడాకులు తీసుకుని దూరంగా ఉన్న జంట, పెళ్లెందుకురా అనుకునే వారు సినిమా చూసి వెంటనే దగ్గరైపోతారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ, వి.వి.వినాయక్‌, పోసాని కృష్ణమురళి, కోనవెంకట్‌, ఛార్మి, నందు, అనైక సోఠి, ఉత్తేజ్‌, సురభి, సిరాశ్రీ, పూనమ్‌, నవీన్‌ యాదవ్‌, రామసత్యనారాయణ, మ్యాంగో వంశీ, రాజ్‌ కందుకూరి, సి.వి.రావు, కళామందిర్‌ కళ్యాణ్‌, ఎడిటర్‌ అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ