Advertisementt

‘తస్కర’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌

Fri 24th Apr 2015 02:36 AM
telugu movie taskara,producer mohd. ansari,rohith kumar  ‘తస్కర’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌
‘తస్కర’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

కిరీటి, నీసా జంటగా లిబ్రా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లిబ్రా మీడియా దర్శకత్వంలో మహ్మద్‌ అన్సారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ గురువారం ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...

కిరిటీ: టాలెంటెడ్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ కలిసి చేసిన సినిమా ఇది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్కూల్‌లో సంగీతం నేర్చుకున్న రోహిత్‌కుమార్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ చేశారు. ఒక సాధారణ వ్యక్తి ఆర్‌.బి.ఐ నుండి తెలివిగా ఎలా డబ్బు కొట్టేశాడనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. 

రోహిత్‌కుమార్‌:  ఇది ఒక ఇంటలెక్చువల్‌ సినిమా. మంచి స్క్రీన్‌ప్లేతో అందరికీ అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయడానికి స్కోప్‌ వున్న సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. 

మహ్మద్‌ అన్సారి: సినిమా చాలా బాగా వచ్చింది. రోహిత్‌ మ్యూజిక్‌, రాజేంద్రనాథ్‌ ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతాయి. హాలీవుడ్‌ సినిమాని గుర్తు తెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. 

రాజేంద్రనాథ్‌: సినిమాటోగ్రాఫర్‌గా నాకు ఇది తొలి సినిమా. కిరీటి చాలా మంచి కథ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 

శ్రీనివాస్‌, గోవింద్‌, సంపత్‌రాజ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీనాథ్‌, సినిమాటోగ్రఫీ: రాజేంద్రనాథ్‌, సంగీతం: రోహిత్‌కుమార్‌, నిర్మాత: మహ్మద్‌ అన్సారి, దర్శకత్వం: లిబ్రా మీడియా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ