Advertisementt

'రెడ్ అలర్ట్' ట్రైలర్ లాంచ్..!

Fri 24th Apr 2015 02:16 AM
red alert movie,trailer launch,mahadev,chandramahesh,sriram reddy  'రెడ్ అలర్ట్' ట్రైలర్ లాంచ్..!
'రెడ్ అలర్ట్' ట్రైలర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ జంటగా పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీలయ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి( లేట్) నిర్మించిన సినిమా 'రెడ్ అలర్ట్'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ "శ్రీరాంరెడ్డి లాంటి మంచి నిర్మాతను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ సినిమాకి ఆయన ఎంతగానో సహకరించారు. పోసాని మురళీకృష్ణ గారు నాకు లైఫ్ ఇచ్చిన మనిషి. నా రెండు సినిమాలు 'ప్రేయసి రావే' , 'అయోధ్య రామయ్య' సినిమాలకు మాటలు కథ ఆయనే అందించారు. ఈ సినిమాలో ఆయన ఓ మంచి పాత్ర పోషించారు. ఏకకాలంలో నాలుగు ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం" అని చెప్పారు.

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ "చంద్రమహేష్ గారితో నాకు ఎప్పటినుండో పరిచయం. ఈ సినిమాలో ఓ ఫన్నీ రోల్ లో నటించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

సంగీత దర్శకుడు రవివర్మ మాట్లాడుతూ "ఈ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు.శ్రీరాంరెడ్డి గారు చాలా మంచి మనిషి. డబ్బు గురించి ఆలోచించకుండా సినిమా క్వాలిటీ గా రావాలని భావించే పర్సన్. అలాంటి వారిని పోగొట్టుకోవడం చాలా బాధగా ఉంది" అని చెప్పారు.

హీరో మహదేవ్ మాట్లాడుతూ "ఈరోజు సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం కానీ శ్రీరాంరెడ్డి గారు అకాలమరణం చెందడం వలన ట్రైలర్ లాంచ్ జరుపుకుంటున్నాం. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మొదటిసారిగా నాలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీరాం చౌదరి, కెమెరా: కళ్యాన్ సమి, ఎడిటింగ్: గౌతంరాజ్, పాటలు: చంద్రబోస్, శ్రీరాం తపస్వి, శ్రీవల్లి, కోప్రొడ్యూసర్: శ్రీమతి పిన్నింటి శ్రీరాంసత్యరెడ్డి.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ