మనోజ్ నందం, మిత్ర, మాదాల రవి ప్రధాన పాత్రల్లో మణి సమర్పణలో శ్రీ హయగ్రీవ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో జె.రామారావు సమర్పిస్తున్న సినిమా 'అలౌకిక'. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు భానుకిరన్ చల్లా మాట్లాడుతూ "మంచి సందేశాత్మక చిత్రాలను మాత్రమే నిర్మించాలనే ఉద్దేశ్యంతో శ్రీ హయగ్రీవ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించాం. ఈ సినిమా స్టొరీ లైన్ విని నిర్మాత వెంటనే ఓకే చేసారు. 'అలౌకిక' చిన్న సినిమా అయినా పెద్ద కాన్సెప్ట్ తో వస్తోంది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కాస్త వినోదం, కాస్త భయం, మరికాస్త సరదాగా.. అన్ని రసాల మిళితంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోగా నటించిన మనోజ్ నందం కు ఈ సినిమా ఎసెట్ అవుతుంది. తమిళంలో ఈ చిత్రాన్ని 'ఊర్మిళ' అనే పేరుతో విడుదల చేస్తున్నాం" అని చెప్పారు.
నిర్మాత రామారావు మాట్లాడుతూ "ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని గురువారం (ఏప్రిల్ 23)న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో నటించిన అందరు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డైలాగ్స్ , స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. హారర్, కామెడీ, సస్పెన్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది" అని చెప్పారు.
మాదాల రవి మాట్లాడుతూ "రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత సామాజిక స్ప్రుహ ఉన్న మనిషి. ఆయన కోరిక మేరకు ఈ సినిమాలో ఓ పాత్రలో నటించాను. మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
మనోజ్ నందం మాట్లాడుతూ "ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి సమయంలో జరిగింది. అందరు చాలా కష్టపడి పని చేసారు. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేసాం. 'అలౌకిక' అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
మిత్ర మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎడిటర్: నాగిరెడ్డి.వి , సంగీతం: ప్రమోద్.కె , ఆర్ట్: విజయకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సూర్య ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరిచరణ్ .