Advertisementt

‘పాకశాల’ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది

Wed 22nd Apr 2015 05:04 AM
telugu movie pakashala,pakashala trailer,gopichand malineni,madhura sridhar reddy  ‘పాకశాల’ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది
‘పాకశాల’ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది
Advertisement

వంటగది బ్యాక్‌డ్రాప్‌లో ఓ కొత్త తరహా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో వంటగది ఓ కథ చెబుతుంది. ఐశ్వర్య సినీ స్టూడియో పతాకంపై ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘పాకశాల’(దిస్‌ కిచెన్‌ హ్యాజ్‌ ఎ స్టోరీ టు టెల్‌) పేరుతో రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఐశర్య సినీ స్టూడియో బ్యానర్‌ లోగోను ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆవిష్కరించారు.  సినిమాకి సంబంధించిన మొదటి పోస్టర్‌ను మల్టీ డైమెన్షన్‌ వాసు, రెండవ పోస్టర్‌ను ప్రముఖ దర్శకనిర్మాతలు కె.సురేష్‌బాబు, పి.విజయ్‌వర్మ, ప్రశాంత్‌శర్మ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గోపీచంద్‌ మలినేని, సురేష్‌ కొండేటి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

గోపీచంద్‌ మలినేని: ట్రైలర్‌ చూస్తుంటే ఇది ఒక మంచి థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ఈ సినిమా లైన్‌ నాకు తెలుసు. చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ఈమధ్యకాలంలో థ్రిల్లర్స్‌ పెద్ద హిట్‌ అవుతున్నాయి. అదే కోవలో ఈ ‘పాకశాల’ కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. 

దీప్తి వాజ్‌పేయి: ఈ చిత్ర నిర్మాత రాజ్‌కిరణ్‌గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయన నిర్మాతే కాదు, మంచి ఆర్టిస్ట్‌. ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్‌గా ఎదిగినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతగా కూడా ఆయన సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

మధుర శ్రీధర్‌రెడ్డి: హార్డ్‌ వర్క్‌, టాలెంట్‌ వుంటే సక్సెస్‌ అనేది తప్పకుండా వస్తుంది అనేది నేను బాగా నమ్ముతాను. ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు కూడా అలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ అంటే చాలా ఇంట్రెస్ట్‌. నేను దర్శకుడిగా, నిర్మాతగా అలాంటి సినిమా చెయ్యాలనుకుంటాను. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది. 

రాజ్‌కిరణ్‌: ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. హుదూద్‌ని తట్టుకొని ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మేం వైజాగ్‌ వెళ్తున్నప్పుడే హుదూద్‌ స్టార్ట్‌ అయింది. అనుకున్న షెడ్యూల్‌లో షూటింగ్‌ చెయ్యలేము అనుకున్నాం. మా రైటర్‌ గురుకిరణ్‌ సహకారంతో మంచి లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చెయ్యడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందర్నీ థ్రిల్‌ చెయ్యడానికి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తాం.

విశ్వ, శ్రీనివాస్‌, హరీష్‌ చక్ర సతీష్‌, జగదీష్‌రెడ్డి, అర్పిత, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరద్వాజ్‌ దాసరి, పాటలు: హరీష్‌చక్ర సతీష్‌, సంగీతం: శ్రవణ్‌ ఎస్‌. మిక్కీ, ఆర్ట్‌: బాలు, ఎడిటింగ్‌: అనిల్‌రాజ్‌, రచన: గురుకిరణ్‌, సహనిర్మాత: ఆర్‌.పి.రావు, నిర్మాత: రాజ్‌కిరణ్‌, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement