Advertisementt

సుకన్య మహేష్ కి ఏమవుతుంది..!!

Tue 21st Apr 2015 02:22 PM
maheshbabu,sukanya in srimanthudu,prince mahesh,sukanya,srimanthudu news,  సుకన్య మహేష్ కి ఏమవుతుంది..!!
సుకన్య మహేష్ కి ఏమవుతుంది..!!
Advertisement
Ads by CJ

 

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రుతీహాసన్‌ కథానాయిక. ‘శ్రీమంతుడు’ టైటిల్‌ పరిశీలనలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటో ఇంటర్నేట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో మహేశ్‌తోపాటు అలనాటి తార సుకన్య ఉన్నారు. మహేష్‌బాబుకి సుకన్య ఏదో చెబుతున్నట్లుగా ఉన్న స్టిల్‌ అది. ఇందులో మహేష్‌బాబుకి సుకన్య ఏమవుతుందో తెలియాల్సి ఉంది. అయితే జగపతిబాబుకి జతగా నటిస్తోందని తెలుస్తోంది. పెద్దరికం సినిమాలో జగపతిబాబు, సుకన్య జత కట్టిన విషయం తెలిసిందే. 1994లో ‘కెప్టెన్‌’ సినిమా తర్వాత 11 ఏళ్ళ గ్యాప్‌ తర్వాత ‘శ్రీ’, 2007లో ‘మున్నా’, 2012లో ‘అధినాయకుడు’ సినిమాల్లో కనిపించింది సుకన్య. మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో కనిపిస్తుంది సుకన్య. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ