Advertisementt

'రోబో-2' విలన్‌గా విలక్షణ నటుడు..!!

Tue 21st Apr 2015 05:56 AM
robo sequel,kamal hassan,vilan,shankar  'రోబో-2' విలన్‌గా విలక్షణ నటుడు..!!
'రోబో-2' విలన్‌గా విలక్షణ నటుడు..!!
Advertisement
Ads by CJ

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఐ' చిత్రం నిరాశపర్చడంతో ఇక డైరెక్టర్‌ శంకర్‌ రోబో సీక్వెల్‌పై దృష్టిసారించాడు. మొదట రోబో సీక్వెల్‌లో హీరోగా పలువురు పేర్లు వినిపించినా తిరిగి రజినీకాంత్‌నే ఎన్నుకున్నాడు శంకర్‌. ఇక అదేస్థాయిలో ప్రతినాయకుడి పాత్ర కోసం కూడా పలువురు స్టార్లను పరిశీలించిన శంకర్‌ బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం బిజీ షెడ్యూల్‌ కారణంగా అమీర్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని తెలిసింది. ఆయన స్థానంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఈ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కమల్‌ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావడమ గమనార్హం. గతంలో కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు' విడుదలైన అన్ని భాషల్లో కూడా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక తమిళ్‌ ఇండస్ట్రీ టాప్‌ హీరోలు కమల్‌, రజినీలు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్న 'రోబో-2' ఎలాంటి సరికొత్త సంచలనాలను నమోదు చేస్తుందోనని ఇండస్ట్రీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ