Advertisementt

చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘దానవీరశూరకర్ణ’

Tue 21st Apr 2015 12:55 AM
daanaveera soora karna news,daanaveera soora karna shoot completed,daanaveera soora karna on 28 may,daanaveera soora karna,master  చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘దానవీరశూరకర్ణ’
చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘దానవీరశూరకర్ణ’
Advertisement
శ్రీసాయి జగపతి పిక్చర్స్‌`సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో జె.వి.ఆర్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దానవీరశూకర్ణ’. చలసాని వెంకటేశ్వరరావు`జె.బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టారు. స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ పెద్దకుమారుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జె.వి.ఆర్‌ మాట్లాడుతూ... ‘జనవరి 23న ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో సారధీ స్టూడియోలో వైభవంగా ప్రారంభించాం. సింగిల్‌ షెడ్యూల్‌లో అహరహం శ్రమించి చిత్రీకరణ పూర్తి చేశాం.  బాలనటీనటులంతా మేమూహించిన దానికన్నా బాగా నటించారు. కృష్ణునిగా నటిస్తున్న మాస్టర్‌ ఎన్టీఆర్‌ తాతకు తగ్గ మనవనిగా పేరు తెచ్చుకుంటారనటంలో సందేహంలేదు. మాస్టర్‌ ఎన్టీఆర్‌ తమ్ముడు సౌమిత్ర సహాదేవుని పాత్రను అద్భుతంగా పండిరచాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు.
నిర్మాతలలో ఒకరైన జె.బాలరాజు మాట్లాడుతూ... ‘‘బాల రామాయణం’ చిత్రం తర్వాత.. దాదాపు 18 ఏళ్ల విరామానంతరం అందరూ బాల నటీనటులతో వస్తున్న చిత్రం ‘దానవీరశూరకర్ణ’. ఎంతో శ్రద్ధాసక్తులతో, చక్కని స్క్రిప్ట్‌తో, ఆకట్టుకునే సెట్స్‌తో, ఆభరణాలతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకులు జె.వి.ఆర్‌ ప్రతీ సీన్‌ను అద్భుతంగా తీస్తున్నారు. మేము ముందు చెప్పినట్టుగానే మాస్టర్‌ ఎన్టీఆర్‌ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే సీనియర్‌ నటీమణి జమున మనవడు ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కాగా, నాటి ‘దానవీరశూరకర్ణ’ చిత్రానికి పని చేసిన చాలా మంది సీనియర్‌ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం. మే 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు
కాజా సూర్యనారాయణ నిర్మాణ నిర్వహకుడిగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రంలో  జయంత్‌ సాయి, యశ్వంత్‌, దిలీప్‌తేజ, శ్యామ్‌గోపాల్‌, కారుణ్య, భార్గవి, యామిని, సాహిత్య, విజ్జు, అభిరామ్‌, చందన్‌, గణేష్‌, దినేష్‌, లోహిత తదితర బాలురు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మేకప్‌మేన్‌: సి.మాధవరావు, నృత్య దర్శకురాలు: ప్రమీల, కళాదర్శకులు: ఎస్‌.ఆర్‌.కె.శర్మ, ఎడిటర్‌: నందమూరి హరి,
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement