రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు సినిమాలో అవకాశం వదులుకోవాలని అనుకోవడం లేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ హీరోగా పివిపి సంస్థ నిర్మించబోయే 'బ్రహ్మోత్సవం'లో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం ఖాయమని, ఆమె మేనేజర్ స్పష్టం చేశారు. ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ సినిమా నుండి తప్పుకుందని వస్తుందనే వార్తల పట్ల మేనేజర్ స్పందించారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ నటిస్తున్న 'కిక్ 2', 'పండగ చేస్కో', 'సిమ్లా మిర్చి' సినిమాలు చివరిదశలో ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు నెలలో 15 రోజుల చొప్పున వచ్చే మూడు నెలలు రకుల్ ప్రీత్ డేట్స్ కేటాయించింది. అవి పూర్తయిన తర్వాత మహేష్ బాబు సినిమా షూటింగులో పాల్గొంటుందని మేనేజర్ తెలియజేశారు. చూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే ఎ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.