Advertisementt

కొత్త తరహా హార్రర్‌ మూవీ ‘అమ్మో’ (నాకు భయం)

Sun 19th Apr 2015 01:42 PM
telugu movie ammo,hari and harsish,er v. lokanathan,spb charan  కొత్త తరహా హార్రర్‌ మూవీ ‘అమ్మో’ (నాకు భయం)
కొత్త తరహా హార్రర్‌ మూవీ ‘అమ్మో’ (నాకు భయం)
Advertisement

గోకుల్‌నాథ్‌, మేఘన, బాబి సింహ, బాల శరవణన్‌ ప్రధాన పాత్రల్లో కె.టి.వి.ఆర్‌. క్రియేటివ్‌ ఫ్రేమ్స్‌ పతాకంపై హరి అండ్‌ హరీష్‌ దర్శకత్వంలో ఇ.ఆర్‌.వి.లోకనాథన్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హార్రర్‌ మూవీ ‘అమ్మో’. ‘నాకు భయం’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ ఈ చిత్రం కోసం వెలిదండ్ల రచించిన ‘అద్దాల మేడ ముందున్న లైఫు..’ అనే పాటను ఎస్‌.పి.బి.చరణ్‌ పాడగా ఇటీవల రికార్డ్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత లోకనాథన్‌. 

ఈ చిత్రం గురించి నిర్మాత ఇ.ఆర్‌.వి.లోకనాథన్‌ తెలియజేస్తూ ‘‘ఇది ఒక విభిన్నమైన కథాంశం. ఇప్పటివరకు వచ్చిన హార్రర్‌ సినిమాలకు భిన్నంగా వుండే కథతో రూపొందుతోంది. నలుగురు స్నేహితుల మధ్య ఓ పందెం చోటు చేసుకుంటుంది. దెయ్యం లేదని నలుగురిలో ఒకడు వాదిస్తాడు. వుందని ముగ్గురు వాదిస్తారు. దెయ్యం వుందని నిరూపిస్తే తన ఆస్తిలో సగం రాసిస్తానని మొదటివాడు బెట్‌ కడతాడు. దానికి ఓకే అన్న ముగ్గురు దెయ్యం వుందని నిరూపించడానికి సిద్ధపడతారు. ఆ ముగ్గురు దెయ్యం వుందని నిరూపించారా? బెట్‌ ఎవరు గెలిచారు? చివరికి ఏమైందనేది కథ. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండే కథ, కథనాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే విధంగా హరి, హరీష్‌ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్‌ సినిమాలా మా రచయిత రేవూరు(రే.నా) మంచి మాటలు అందించారు. ఎ.వి.ఎం.వారు నిర్మించగా జెమినిలో ప్రసారమైన ‘జానకి’ అనే సూపర్‌హిట్‌ టి.వి. సీరియల్‌కి రేవూరు దర్శకత్వం వహించారు. ఎంతో అనుభవం వున్న రేవూరు ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు.

గోకుల్‌నాథ్‌, మేఘన, బాబి సింహ, బాల శరవణన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన: రేవూరు(రే.నా.), సంగీతం: వెంకట్‌ప్రభు శంకర్‌, సినిమాటోగ్రఫీ: జి.సతీష్‌, పాటలు: వెలిదండ్ల, గానం: ఎస్‌.పి.బి.చరణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.నాగరాజన్‌, నిర్మాత: ఇ.ఆర్‌.వి.లోకనాథన్‌, దర్శకత్వం: హరి, హరీష్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement