డిఫరెంట్ కాన్సెప్ట్ కథలను ఎంటర్‌టైనింగ్‌గా చెబితే వాటికి తిరుగే ఉండదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను తప్పక ఆదరిస్తారు. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ, ‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో హాట్రిక్ కొట్టిన యువ హీరో నిఖిల్. కాగా త్వరలో ఆయన ‘శంకరాభరణం’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోనవెంకట్ సహనిర్మాతగా వ్యవహరించడమే కాదు... దీనికి కథ, కథనం, మాటలను సైతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం బాలీవుడ్ హిట్‌మూవీ ‘ఫస్ గయే రే ఒబామా’ అనే సినిమాకు ఫ్రీమేక్ అని సమాచారం. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.