స్టార్‌హీరోయిన్లుగా చెలామణి అయ్యే వారిని హీరోకు చెల్లిగా మంచి అవకాశం ఇస్తాం.. చేయమని అడిగినా ఠక్కున నో చెప్పేస్తారు. ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉన్నా కూడా అలాంటి పాత్రలను చేయడానికి డిమాండ్ ఉన్న హీరోయిన్లు ఇష్టపడరు. అలాంటిది తమిళంలో ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న లక్ష్మీమీనన్ మాత్రం దానికి విరుద్దంగా చెల్లెలి పాత్రను చేయడానికి ఓకే చెప్పింది. త్వరలో అజిత్ హీరోగా ‘వీరం’ దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్ర కథ అన్నాచెల్లెల అనుబంధం మీద నడిచే కథ కావడంతో హీరో చెల్లి పాత్ర కోసం నిత్యామీనన్, శ్రీదివ్య, బిందు మాధవి వంటి పలువురిని సంప్రదించినా చెల్లి పాత్ర చేయడానికి నో చెప్పారట. చివరకు ఈ పాత్రను ధైర్యం చేసి లక్ష్మీమీనన్ ఓకే చేసింది. అజిత్ వంటి స్టార్‌హీరోకు చెల్లిగా నటిస్తే తనకు మరింత క్రేజ్ వస్తుందని లక్ష్మీమీనన్ అభిప్రాయపడుతోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తానికి అజిత్‌కి చెల్లెలు దొరికింది.. కథ సుఖాంతం అయిందని అందరూ సంతోషంగా ఉన్నారు.