ధనరాజ్, మనోజ్‌నందం, రణధీర్, అనిల్ కళ్యాణ్, విజయ్‌సాయి, సింధుతులాని, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్ ముఖ్య తారాగణంగా.. మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ థ్రిల్లర్ ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శక సంచలనం రాంగోపాల్‌వర్మ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ముఖ్యపాత్రధారులు ధనరాజ్, మనోజ్‌నందం, అనిల్ కళ్యాణ్, విజయ్‌సాయి, చిత్ర దర్శకులు సాయి అచ్చుత్ చిన్నారిలతోపాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ... ‘నా దర్శకత్వంలో ‘ఐస్‌క్రీమ్`1 మరియు ఐస్‌క్రీమ్`2 నిర్మించి,, నాతో మరికొన్ని చిత్రాలు నిర్మిస్తున్న రామసత్యనారాయణ` ‘ఐస్‌క్రీమ్`2’లో నటించిన ధనరాజ్ కలిసి రూపొందిస్తున్న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా కాన్సెప్ట్ నాకు తెలుసు. ధనరాజ్ మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు, అతనిలో మంచి టెక్నీషియన్ కూడా ఉన్నాడు. సినిమా పట్ల అతనికి కూడా చాలా ప్యాషన్. మంచి ఫైర్ కలిగిన టీమ్ ఎంతో శ్రద్ధగా రూపొందించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ విజువల్స్ చాలా బాగున్నాయి. టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను’ అన్నారు.
భోలే శావలి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: శివ వై.ప్రసాద్, కెమెరామెన్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ప్రసాద్ మల్లు(యుఎస్‌ఎ)`ప్రతాప్ భీమిరెడ్డి (యుఎస్‌ఎ) సమర్పణ: మాస్టర్ సుక్కురామ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`సంభాషణలు`దర్శకత్వం: సాయి అచ్యుత్ చిన్నారి!!