Advertisementt

దాగుడుమూతలు ఆడేందుకు సిద్ధమైంది..!

Sat 18th Apr 2015 09:57 AM
dagudumotha dandakor,krish,dil raju,r.k.malineni,ramojirao  దాగుడుమూతలు ఆడేందుకు సిద్ధమైంది..!
దాగుడుమూతలు ఆడేందుకు సిద్ధమైంది..!
Advertisement
Ads by CJ

 ఉషాకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై క్రిష్ సమర్పణలో ఆర్.కె.మలినేని దర్శకత్వంలో రామోజీరావు నిర్మిస్తున్న సినిమా 'దాగుడుమూత దండాకోర్'. ఈ సినిమాలో రాజుగారి పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించగా ఆయన మనవరాలిగా నాన్న ఫేమ్ సారా అర్జున్ నటించింది. మరో ముఖ్య పాత్రలో కోడిపుంజు నటించింది. అనుబంధాలను పాత్రలో మెడలో మాలగా వేసి అనుభూతులను సంఘటనల సమాహారంగా మార్చి ప్రేక్షకుల మనసులలో, ప్రేక్షకుల హృదయాలతో దాగుడుమూతలు ఆడేందుకు సిద్ధమైంది 'దాగుడుమూత దండాకోర్' చిత్రం. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ "ఈ సినిమాకి మాతృక తమిళంలో విజయం సాధించిన 'శైవం' సినిమా.. ఇటీవల జరిగిన 62వ జాతీయ అవార్డుల జాబితాలో, రెండు జాతీయ అవార్డులను కొల్లగొట్టి తన సత్తా చాటుకుంది. ఇచ్చిన మాట తప్పని రాజుగారు, ఆయన దారిలో నడిచే మనవరాలు, వీరిద్దరి అనుబంధాలతో దాగుడుమూతలాడిన ఓ కోడిపుంజు, వీరికి తోడు తమ సయ్యాటలతో అందరి మధ్య సమస్యలను సృష్టించిన ఒక యువ జంట కథ ఈ చిత్రం. ఈ సినిమాని చూసిన దిల్ రాజు గారు.. సినిమా బాగా నచ్చడంతో తానే స్వయంగా కొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు" అని తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ "క్రిష్ తను డైరెక్ట్ చేసిన 'గమ్యం' సినిమా నాకు చూపించాలని, నాతో డిస్ట్రిబ్యూట్ చేయించాలని చాలా ట్రై చేసాడు కాని నేను పట్టించుకోలేదు. సినిమా విడుదలయ్యాక ఒక మంచి సినిమా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ కలిగింది. 'దాగుడుమూత దండాకోర్' సినిమా కాపీ రెడీ అవ్వగానే నాకు చూపించారు. సినిమా నచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంగీకరించాను. క్రిష్,  రామోజీరావు గారితో మాట్లాడి ఈ సినిమా హక్కులు నాకు ఇప్పించారు. ఈ సినిమాను తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లలో ప్రివ్యూ షో వేయాలాని ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం"అని చెప్పారు.
ఆర్.కె.మలినేని మాట్లాడుతూ "అచ్చమైన తెలుగు సినిమా ఇది. ఇదొక ఫ్యామిలి కథ. సినిమా చూసిన తరువాత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది" అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, సినిమాటోగ్రాఫర్: వి.ఎస్.జ్ఞాన శేఖర్, మాటలు: పెద్దింటి అశోక్ కుమార్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి .

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ