తమిళంలో ‘రమణ’ గా వచ్చి సూపర్‌హిట్టు అందుకున్న చిత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’గా ఘనవిజయం సాదించింది. ఇదే సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా శృతిహాసన్, కరీనాకపూర్‌లు హీరోయిన్లుగా ‘గబ్బర్’గా రూపొంది విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి మన తెలుగు దర్శకుడు క్రిష్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్ రోజు రోజుకు ఊపందుకొంటోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఆడియో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఆర్‌ఐపి కరెప్షన్ పేరుతో ప్రమోషన్ మొదలైంది. ఇక ఈ చిత్రంలోని ‘ఆవో రాజా ’ పాట అదరగొడుతోంది. ఈ పాటను ఐటం సాంగ్‌గానే కాకుండా ప్రమోషనల్ సాంగ్‌గా కూడా వాడుకుంటున్నారు. ఈ పాటకు చిత్రాంగధ సింగ్ చిందులేసింది. అలాగే కరీనాకపూర్ వానపాటకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి ఈ చిత్రం బాలీవుడ్‌లో ‘రమణ, ఠాగూర్’లాగా సంచలనం సృష్టించి అక్షయ్‌కుమార్, క్రిష్‌లకు ఎంతటి పేరును తెస్తుందో చూడాలి...!