హిందీలో సూపర్‌హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో గబ్బర్‌సింగ్‌గా, తమిళ్‌లో ఓస్తేగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో పవన్‌కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌గా రికార్డులు క్రియేట్ చేసిన తన కెరీర్‌లోనే పెద్ద కమర్షియల్ హిట్ సాధించాడు. తమిళ్‌లో శింబు దబాంగ్ చిత్రం రీమేక్‌లో నటించాడు. ఇప్పటివరకు మనం దబాంగ్ చూశాం, గబ్బర్‌సింగ్ చూశాం. ఇప్పుడు శింబు చేసిన తిమ్మిరి చూడబోతున్నాం. ఏప్రిల్ 25న ఈ చిత్రం 500 థియేటర్లలో భారీగా రిలీజ్ కాబోతోంది. ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో శింబు ‘తిమ్మిరి’ చిత్రంతో మరోసారి ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నాడు. బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రమేష్ తాండ్ర, గ్రిహీత్ తాండ్ర నిర్మించిన ఈ చిత్రానికి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘బంగారం’ చిత్ర దర్శకుడు ఎస్. ధరణి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం గురించి నిర్మాత రమేష్ తాండ్ర మాట్లాడుతూ ‘‘శింబు హీరోగా నటించిన మరో సూపర్‌హిట్ మూవీ ఇది. ‘మిరపకాయ్’ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ శింబు సరసన నాయికగా నటించింది. అరుంధతి, దూకుడు వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించిన సోనూసూద్ ఇతరులు మెయిన్ విలన్‌గా నటించగా ప్రముఖ నటుడు నాజర్ మరో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటల్ని భాగ్యలక్ష్మి రాశారు. మ్యూజికల్‌గా గత శింబు చిత్రాల్లాగే పెద్ద హిట్ అయింది. ఏప్రిల్ 25న 500 థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ హాట్ సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈ ‘తిమ్మిరి’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాగ్యలక్ష్మి, సంగీతం: థమన్ యస్.యస్, నిర్మాతలు: రమేష్ తాండ్ర, గ్రిహీత్ తాండ్ర, దర్శకత్వం: ఎస్.ధరణి.