Advertisementt

'బుడుగు' విడుదలకు రెడీ..!

Thu 16th Apr 2015 08:54 AM
budugu,april 17th release,manmohan,bhaskar,sreedhar rao  'బుడుగు' విడుదలకు రెడీ..!
'బుడుగు' విడుదలకు రెడీ..!
Advertisement
Ads by CJ

సుదీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిల్మ్ ఇన్నోవేటీస్ ప్రై లిమిటెడ్ పతాకంపై మన్ మోహన్ దర్శకత్వంలో బాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'బుడుగు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ భాస్కర్ మాట్లాడుతూ "ఫామిలీ డ్రామా తో కూడిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా బుడుగు. ఈ సినిమా ట్రైలర్స్ కి, పాటకు ఇండస్ట్రీ నుండి మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.ఈ సినిమా ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ లో వచ్చిన అనుభవంతో ఓ షార్ట్ ఫిల్మ్ ను తీయాలని భావిస్తున్నాను" అని తెలిపారు.

దర్శకుడు మన్ మోహన్ మాట్లాడుతూ "ఇది నా రెండవ సినిమా. 8 సంవత్సరాల అబ్బాయికి, తన ఫ్యామిలీ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తల్లిదండ్రులు ముఖ్యంగా చూడాల్సిన సినిమా ఇది. మంచు లక్ష్మి, శ్రీధర్, ప్రేమ్ బాబు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

శ్రీధర్ రావు మాట్లాడుతూ ''ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తిక్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వంశీ పులురి, ఎడిటింగ్: శ్యామ్ మెంగ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ