Advertisementt

బ్యాంకాక్లో రామ్ చరణ్ ట్రైనింగ్ సెషన్!

Thu 16th Apr 2015 05:36 AM
srinu vaitla,ram charan,martial arts,stunt man character,ram charan new movie  బ్యాంకాక్లో రామ్ చరణ్ ట్రైనింగ్ సెషన్!
బ్యాంకాక్లో రామ్ చరణ్ ట్రైనింగ్ సెషన్!
Advertisement
Ads by CJ
శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా చరణ్ స్టంట్ మాన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రేక్షకుల చేత చప్పట్లు, ఈలలు వేయించే ఫైట్స్ వెనుక ఎంతటి కృషి దాగుందో ఈ సినిమాలో చరణ్ చూపనున్నాడు. రిస్కీ స్టంట్స్ చేయడానికి రెడీ అయ్యాడు. పాత్రలో పర్ఫెక్షన్ కోసం తీవ్రమైన, కష్టతరమైన ఫైట్స్, స్టంట్స్ చేయడంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్ కు ఫేమస్ అయిన బ్యాంకాక్ వెళ్ళాడు. వారం రోజుల పాటు ఈ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత చరణ్ షూటింగులో పాల్గొంటారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 22 మొదలు కానుంది. కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. శ్రీనువైట్ల శైలిలో సాగిపోయే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అని సమాచారం.    
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ