Advertisementt

మణిరత్నం గారు మంచి క్రిటిక్..!

Thu 16th Apr 2015 01:44 AM
  మణిరత్నం గారు మంచి క్రిటిక్..!
మణిరత్నం గారు మంచి క్రిటిక్..!
Advertisement
Ads by CJ

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నిత్యమీనన్‌ హీరోయిన్‌గా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఓ కాదల్‌ కన్మణి’. ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో మద్రాస్‌ టాకీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "మణిరత్నం గారి గీతాంజలి సినిమా పన్నెండు సార్లు చూసాను. ఆయనంటే అంత అభిమానం నాకు.15 సంవత్సరాల క్రితం మేం డిస్ట్రిబ్యూటర్స్‌గా వున్నప్పుడు మణిరత్నంగారి ‘సఖి’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్‌ చేశాం. ఆ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ‘సఖి’లాంటి సినిమా మణిరత్నంగారు తీస్తున్నారని తెలిసి 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తెలుగు రైట్స్‌ కోసం ఆయన్ని కలవడం జరిగింది. ఈ సినిమా కంటెంట్‌ గురించి తెలుసుకున్న తర్వాత సఖి తర్వాత వస్తున్న మరో క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది అనిపించింది. ఈ సినిమాలో దుల్కర్, నిత్య అధ్బుతంగా నటించారు" అని తెలిపారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ "ఈ సినిమా పాటలు డబ్బింగ్ సినిమా పాటలుగా కాకుండా తెలుగు సినిమా పాటలుగానే విడుదలయ్యాయి. ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించడంలో మణిరత్నం గారు నాకు చాలా స్వేచ్చనిచ్చారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంక నటీనటుల  పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీకి ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటుడు దొరకడం మన అదృష్టం. సినిమాలో నిత్య షాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది" అని అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ "ఒక వ్యక్తిగా దిల్ రాజు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలో కసి, సహృదయం  నాకు నచ్చుతాయి. మణిరత్నం, రెహమాన్ సినిమాలు చూస్తూ వారిలా నాకంటూ మంచి గుర్తింపు పొందాలని ట్రై చేసాను. మణిరత్నం గారి ఫ్రేములో ఒక్కసారైనా కనిపించాలి అని చాలా ఆశ పడేవాడిని. అలాంటిది ఆయన సినిమాలలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మనకు ఒక బాధ్యతను అప్పగిస్తారు. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయనతో పని చేసే ప్రతి క్షణం ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇంక ఎ.ఆర్.రెహమాన్ గురించి చెప్పాలంటే విభిన్నంగా బ్రతకాలనే కృషి ఆయనలో కనిపిస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి చాలా పవర్ ఉంది. ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలలో నిత్య నటన అధ్బుతంగా ఉంటుంది" అని చెప్పారు.
నాని మాట్లాడుతూ "నేను మణిరత్నంగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం ఆనందంగా ఉంది. చాలా మంచి కథ. ప్రతి ఒకరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అసలు ఈ సినిమాలో నేను నటించి దుల్కర్ కన్నడలో నాకు డబ్బింగ్ చెప్తే బావుండేది అని ఫీలింగ్ కలుగుతుంది" అని చెప్పారు.
నిత్యమీనన్ మాట్లాడుతూ "ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం, ఎ.ఆర్.రెహమాన్ లాంటి లెజండరీస్ తో కలిసి పని చేయడం మంచి అనుభవం"
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ "మణిరత్నం గారు మంచి క్రిటిక్. అధ్బుతమైన సినిమాలను తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో నిత్య, ప్రకాష్ రాజ్ గారి నటన చాలా బావుంటుంది. సిరివెన్నెల గారి సాహిత్యం ఈ సినిమా ఆడియోకి ప్లస్ అయింది. మ్యూజిక్ ను మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
మణిరత్నం మాట్లాడుతూ "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని చూసి తెలుగు స్పీచ్ ఇవ్వాలనుకున్నదంతా మర్చిపోయాను. 'ఓకే బంగారం' అనే బంగారాన్ని దిల్ రాజు చేతిలో పెట్టాను. ఈ సినిమాలో నిత్య, దుల్కర్ చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ నా ఫ్యామిలి మనిషి" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ