దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగం’ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా ఘనవిజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరో జీవా కెరీర్‌నే మలుపు తిప్పింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఓ కొత్త టీమ్ సిద్దమవుతోంది. బాబీ సింహా హీరోగా, నిక్కీ గల్రాని హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి శరత్‌మండవ్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్ ‘రంగం’ తరహాలో ఘనవిజయం సాధిస్తుందో లేక కేవలం ‘రంగం’ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందో సినిమా పూర్తయి విడుదల అయితేగానీ చెప్పలేం.. అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు...!