సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయిక. ప్రస్తుతం చిత్ర బృందం మలేషియాలో ఉంది. మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 22 వరకు మలేషియాలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో సన్నివేశాలను, పాటలను తెరకేక్కిస్తారని సమాచారం.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అతిధి పాత్రలో 'అందాల రాక్షసి' ఫేం రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో నర్తించింది. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు అధికారికంగా ప్రకరించలేదు. వేసవి చివరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.