Advertisementt

85 శాతం పూర్తయిన ‘అనగనగా ఒక చిత్రమ్‌’

Mon 13th Apr 2015 03:13 PM
anaganaga oka chitram,shiva,j.prabhakara reddy,meghasri  85 శాతం పూర్తయిన ‘అనగనగా ఒక చిత్రమ్‌’
85 శాతం పూర్తయిన ‘అనగనగా ఒక చిత్రమ్‌’
Advertisement
Ads by CJ

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్‌, గోవర్షిణి ఫిలింస్‌ పతాకాలపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘అనగనగా ఒక చిత్రమ్‌’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ 85 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శివ, హీరోయిన్‌ మేఘశ్రీ, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, దువ్వాసి మోహన్‌, దర్శకుడు జె.ప్రభాకరరెడ్డి, నిర్మాతల్లో ఒకరైన కొడాలి సుబ్బారావు, రచయిత అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

శివ: ప్రభాకరరెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చెయ్యడం నాకు చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమాలో చాలా మంది సీనియర్‌ ఆర్టిస్టులతో వర్క్‌ చేస్తున్నాను. వారు నాకెన్నో వాల్యుబుల్‌ సజెషన్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో మొదట ఇన్నోసెంట్‌గా వుంటూ తర్వాత డిఫరెంట్‌గా మారే క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది.

వెన్నెల కిశోర్‌: ఇందులో నాది చాలా ఫన్నీ క్యారెక్టర్‌. హీరో ఫ్రెండ్‌గా ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ప్రభాకర్‌రెడ్డిగారు రూపొందించిన ప్రేమకథా చిత్రమ్‌ కంటే ఈ సినిమాలో డబుల్‌ ఫన్‌ వుంటుంది.

జయప్రకాష్‌రెడ్డి: మలయ్యగారు నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం. వాళ్ళబ్బాయి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేను ఒక పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ప్రభాకరరెడ్డిగారికి చాలా క్లారిటీ వుంది. తనకి ఏం కావాలో చెప్పి అందరితో చేయించుకుంటున్నారు. ఈ సినిమా మంచి హిట్‌ అయి, మా మల్లయ్యగారి అబ్బాయి మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాను.

మేఘశ్రీ: ఇందులో ఒక ఇన్నోసెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. సేమ్‌టైమ్‌ నా క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌గా కూడా వుంటుంది. ఇందులో నటిస్తున్న అందరు ఆర్టిస్టులతో నాకు సీన్స్‌ వున్నాయి. అందరూ నన్ను ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌గారి ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఈ సినిమాలో కామెడీ వుంది, యాక్షన్‌ వుంది. తప్పకుండా మీ అందరూ ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తారు.

రఘుబాబు: శివ చేసిన ఫస్ట్‌ మూవీలో నేను యాక్ట్‌ చెయ్యాల్సింది. కానీ, డేట్స్‌ ప్రాబ్లమ్‌వల్ల చెయ్యలేకపోయాను. మల్లయ్యగారు పద్మాలయా సంస్థలో ఎప్పటి నుంచో వున్నారు. మా నాన్నగారికి ఈ సంస్థతో ఎంతో అనుబంధం వుంది. అలాంటి మల్లయ్యగారి అబ్బాయి చేస్తున్న ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్‌ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కొడాలి సుబ్బారావు: ప్రభాకరరెడ్డిగారు చెప్పిన కథ చాలా బాగుంది. ఆయన చెప్పిన దానికంటే బాగా తీస్తున్నారు. మేం అనుకున్న టైమ్‌లో సినిమా ఫినిష్‌ చెయ్యడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకరిస్తున్నారు. 

జె.ప్రభాకరరెడ్డి: చిన్న సినిమాగా స్టార్ట్‌ అందరూ పెద్ద ఆర్టిస్టులతో ఒక పెద్ద సినిమాగా మారింది. సినిమా మంచి క్వాలిటీతో రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంతో సహకరిస్తున్నారు. ఇప్పటివరకు 85 శాతం షూటింగ్‌ పూర్తయింది. మే 4న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. మే 15 నుంచి ఫారిన్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేసి మే 31న ఆడియో రిలీజ్‌ చెయ్యాలన్నది మా ప్లాన్‌. 

శివ, మేఘశ్రీ, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, వెన్నెల కిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, గిరిబాబు, రఘుబాబు, సూర్య, పృథ్వి, అనంత్‌, దువ్వాసి మోహన్‌, జోగి బ్రదర్స్‌, అల్లరి సుభాషిణి, కృష్ణవేణి, గగన్‌, డి.వి., మధు, ఖాదర్‌ ఘోరి, శ్యాంసన్‌ నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్‌, సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్‌, ఎడిటింగ్‌: సాయి, ఆర్ట్‌: విజయకృష్ణ, స్టిల్స్‌: బాబు, కాస్ట్యూమ్స్‌: కె.మురళి, మేకప్‌: రంగా, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కొడాలిశ్రీనివాసరావు, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌: నాగిరెడ్డి, ఆర్‌.రాంబాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: సుదర్శన్‌, హరీష్‌ సజ్జా, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: ఉమేష్‌ నాగ, జి.యం.మంజునాథ్‌, కో`డైరెక్టర్‌: యస్‌.నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు, డైరెక్టర్‌ ఆఫ్‌ సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.ప్రభాకరరెడ్డి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ