తన సంస్థలో దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రతి ఇక్కరూ మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు నిర్మాత దిల్ రాజు. ఆయన బ్యానర్‌లో లాంచ్ అయిన చాలామంది దర్శకులు కొందరు మినహా అగ్ర దర్శకుల జాబితాలో ఉన్నారు. ఎస్.వి.సి బ్యానర్‌లో ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వాసు వర్మ. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అప్పటి నుంచి మరో సినిమా అవకాశం దక్కలేదు వాసువర్మకి. అయితే అయితే ‘ఎవడు’, ‘తడాఖా’ సినిమాలకు స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అయితే ఇప్పుడు తనని కూడా దర్శకుడిగా పైకి తీసుకొచ్చేందుకు వాసువర్మకి మరో అవకాశం ఇచ్చారు దిల్ రాజు. సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల హీరోగా సరైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేని సునీల్ ఆశలన్నీ ఈ సినిమాపై పెట్టుకున్నాడు. వాసుది కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకు ‘కృష్ణాష్టమి’ టైటిల్‌ని పరిశీలిస్తున్నారని తెలిసింది. సునీల్‌తో సినిమా అంటే వినోదాత్మకంగా ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ యాప్ట్ అవుతుందనుకోవచ్చు.